Sunday, November 9, 2025

Creating liberating content

టాప్ న్యూస్ఉమామహేశ్వరుడు …ఉమామహేశ్వరుడే..

ఉమామహేశ్వరుడు …ఉమామహేశ్వరుడే..

*మూడో కన్ను తెరిచాడంటే ముప్పతిప్పలు తప్పవ్…
*భవానిపురానికి భద్రత వచ్చిందంటున్న విజ్ఞులు
*వాడల్లో అంతా ప్రశాంతత
*భవానిపురం చరిత్ర తిరగరాసినట్లే…
*నాలుగో సింహం అంటే ఏమిటో చూపిస్తూ…
*చట్టమనేది చుట్టము కాదని నిరూపిస్తూ…
*అనుభవం విజ్ఞతతోనే ఇలా…
*శభాష్ అంటున్న భవాని పురం ప్రజలు…
*నకిలీల గుండెల్లో వణుకు పుట్టేలా…
*నకిలీ వెకిలి మీడియా పై బైన్దోవర్ తోబెండు దీసి…
*మీడియా మాఫీయా పై ఉక్కుపాదం మోపాలని వెల్లువెత్తుతున్న విజ్ఞాపనలు…

  • రౌడీయిజం పేరెత్తాలంటే బెండు తీస్తారని భయం కల్పిస్తూ…
  • మహిళలకు భరోసా గట్టి భరోసా కల్పిస్తూ..
    *కఠినత్వమే కాదు కరుణ కూడా చూపుతూ..
    *కక్కుర్తి రాతాలపై ఓ కన్నేసి ఉంచుతూ…
    *మీడియా ముసుగులో చేస్తున్న నేరాలపై ప్రత్యేక దృష్టి పెడుతూ…
    *కోర్టులు సైతం నివ్వెర పోయెలా…
    *సీపీ లు సైతం ఆలోచన చేసేలా…
    *చిల్లర వేషాలకు చెల్లు చీటి పడేలా…
    *లాఠీ ఎత్తకుండా .. అసభ్య పదజాలం లేకుండానే…
  • బెయిల్ కూడా రావాలంటే భయపడేలా చేస్తూ…
    *చట్ట భద్రతే లక్ష్యంగా సాగుతూ…
    *ఉమామహేశ్వరుడి రూటే సఫరెటు..

(రామమోహన్ రెడ్డి)

“ఎన్నాళ్ళో వేచిన ఉదయం… ఈనాడే ఎదురౌతుంటే
ఇన్ని నాళ్ళు దాచిన హృదయం… ఎగసి ఎగసి పోతుంటే
ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి
ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి
మంచిని పెంచిన మనిషిని… ఏ వంచన ఏమీ చేయదని
నీతికి నిలబడు వానికి… ఏ నాటికి ఓటమి లేదని
నే చదివిన జీవిత పాఠం నీకే నేర్పాలనివస్తే
ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి
నాగులు తిరిగే కోనలో ఏ న్యాయం పనికిరాదని
కత్తులు విసిరేవానిని… ఆ కత్తితోనె గెలవాలని
నేనెరిగిన చేదు నిజం నీతో చెప్పాలని వస్తే
ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి
ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి”అని ఐదు దశాబ్దాల క్రితం మంచి మిత్రులు సినిమా లో చక్కని పాట రూపంలో వినిపించిన ఆ అద్భుతమైన గానం లాగా నేడు కొన్ని సంఘటనలు చూస్తుంటే అవును నిజమేగా అనిపిస్తుంది. అయితే అది నిజమా కాదా అన్నది ఆ సంఘటనలపై ఆలోచన తో అమలు చేసే అధికార వ్యవస్థ పై ఆధారపడి ఉంటుందనేది అక్షర సత్యం.ఇందుకు ఉదాహరణ గా ఎన్ఠీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని భవానిపురం సిఐ ఉమామహేశ్వరరావు గురించి ఎంత చెప్పిన అది అతిశయోక్తి కాదనేది ప్రజాభూమి ,అక్కడి ప్రజల అభిప్రాయం.
అక్రమం అన్యాయం పై అరక్షణం నిర్లక్ష్యం చేయని కఠినత్వం, అసాంఘిక శక్తులు,అల్లరి మూకలపై అలసత్వం చేయని మొండితనం, ఆపద కలిగించారని ,ఆపదలో ఉన్నామని తెలిస్తే ఆ ఆపద వెనుక ఎవరున్నారనేది ఆలోచన చేయక అండగా ఉంటామనే భరోసా ఇస్తూ ఓ వైపు కఠినత్వం ,మరో వైపు కరుణ కలిగి లాఠీ తో పనిలేకుండా అసభ్య పదజాలం అసలే వాడకుండా ఆర్భాటం లేకుండా చట్టానికి చుట్టాల్లేవ్ అని ఆ ప్రాంతం హాయిగా ఉండటానికి అవసరమైన అన్ని ప్రణాళికలు వేస్తూ పోలీస్ అంటే ఇలా ఉండాలని ముందుకు సాగుతూ పటిష్ట చర్యలు చేపడుతున్న భవాని పురం సీఐ ఉమామహేశ్వరరావు గురించి ఎంత చెప్పిన అది పొగడ్త అనుకుంటే అది వారి అజ్ఞానమేనని అనక తప్పదు అతిశయోక్తి అంటే అది వారి వారి విజ్ఞతని అనుకోవడం తప్ప ఇంకొకటి కాదని చెప్పక తప్పదు.కారణం ఒక అధికారి ఒక ప్రాంతములో పనిచేస్తుంటే అనేక విమర్శలు వెల్లువెత్తుతున్న నేపధ్యంలో విపక్షాల నుంచి కూడా కనీస విమర్శలు లేకుండా చట్టాన్ని సక్రమంగా అమలు చేయడంలో ఆయన ఆయానకే సాటీ అని చెప్పాలి. ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే గతంలో భవాని పురం స్టేషన్ అంటే ఎన్నో విమర్శలు,సిబ్బంది పై ఆరోపణలు ఫిర్యాదులతో కిక్కిరిసిపోయేది.అలా వస్తున్న పిర్యాదు లలో ఎక్కువ శాతం స్పందన కు వెళ్ళేవి.అలాగే కొంచెం అభివృద్ధి కి నోచుకోని ఏరియా ప్రజలు కూడా అనేక సమస్యలతో రావడం తమకు న్యాయం జరగలేదని పై అధికారుల వద్దకు వెళ్లే సంఘటనలు బోలెడు చోటు చేసుకునేవి.ప్రభుత్వ విధానాలు ఎలా ఉన్న వాటిని అమలు చేసే అధికారి తీరును బట్టి కూడా అక్కడి పరిస్థితులు చక్కబడతాయనేది యదార్థం. ఇందులో భాగంగా ఆ స్టేషన్ పరిధిలో ఆయన అనేక సంస్కరణలు చేపట్టడం జరిగింది రౌడీ షీటర్ అనే పేరు వినపడకుండా చేయగలిగాడు
ఇంకోక్క ముఖ్య విషయం ఏమిటంటే మీడియా ముసుగులో రెండు వర్గాలు ఏకంగా ఒక పోలీస్ స్టేషన్ పై వాట్సప్ గ్రూప్ లలో పోలీస్ కమిషనర్ లను కూడా టార్గెట్ చేసి ఈ రాష్ట్రంలో ఏ స్టేషన్ పై కూడా ఇన్ని కథనాలు రాలేదేమో అన్న ధర్మ సందేహం తలెత్తె లా ఉంటే గతంలో పనిచేసిన సీఐ లు ఎఫ్ ఐ ఆర్ లు కట్టడంతో సరి పెట్టి మమా అనిపించినట్లు అక్కడ చర్చ జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చింది కొత్త ప్రభుత్వం లో భవానీ పురం సీఐ గా సౌమ్యుడు ,సీనియర్ అధికారి, సర్వీసు ఉన్నా ప్రమోషన్ ఆలస్యం కారణంగా ఏసీపీ అవ్వాల్సిన ఉమామహేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. ఆ వెంటనే పోలీస్ వ్యవస్థకే మచ్చ తెచ్చేలా ఉన్న ఇరువర్గాల పై బైన్దో వర్ పెట్టి విజయవాడ పశ్చిమనియోజకవర్గ పేరు సోషియల్ మీడియాలో ఈ రెండు వర్గాలు పోట్లాట కు పుల్ స్టాప్ పెట్టడడం జరిగింది.అయితే ఒక వర్గం దారి కి వచ్చిన ఇంకో వర్గం తన అసంబద్ధ విధానాలకు కొనసాగిస్తూ సగటు వ్యక్తుల వ్యక్తిత్వ హణనానికి పాల్పడుతున్న తీరు కూడా జరుగుతుంది. అయితే ఆ విషయాలపై కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది.
ఇక నేరమయ సంఘటన విషయాల కు వస్తే వరుస చోరీలు ఆపై గంజాయి దందా ,నేరాల్లో ఆరితేరిన అక్బర్ భాష ,జైలుకు వెళ్లడం రావడం మళ్లీ నేరాలుచేస్తూ శాంతి భద్రతలకు విఘాతముగా మారిన అక్బర్ బాషా పై పిడి యాక్ట్ పెట్టడమే కాకుండా బెయిల్ కూడా రావాలంటే జైలు లో సత్ప్రవర్తన కలిగి ఉన్నట్లు నిరూపితం అయ్యే 1983 నాటి పూర్వపు చట్టానికి పనిపెట్టి ఒక వేల సత్ప్రవర్తన తో బెయిల్ పై వచ్చి ఏదయినా నేరారోపణలు ఎదుర్కొంటే బెయిల్ రద్దు అయ్యే కచ్చితమైన చట్టాన్ని ఉపయోగించడం అంటే అంత సాధారణ విషయం కాదనేది అక్కడి ప్రజలు సీఐ ఉమామహేశ్వరరావు నిబద్ధత పై హార్సాతిరేకాలు వ్యక్తం చేస్తుండగా…నకిలీ వెకిలి మీడియా ముసుగులో ఒక మాఫియా తయారై యూట్యూబర్ లంటూ ఒక మహిళను దోపిడీ చేసిన నకిలీ మీడియా కు బేడీలు వేసి వారి బెండు దీసారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు భవానిపురం సీఐ గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి నేటి వరకు ఎన్కో సంస్కరణలు చేశారు..అయితే కొన్ని నకిలీ మీడియా సోషియల్ మీడియా వేదికగా వెకిలి రాతలు రాస్తూ తమ స్వలాభం, పైశాచిక ఆనందం కోసం ప్రజల్ని తప్పుదోవ పట్టించే పనిలో ఉంటూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఉన్న వారిని గుర్తించి వారిపై ఉక్కుపాదమో..లేక ఏదో ఒక పాదం మోపి గట్టి చర్యలు తీసుకోవాలని ఆయా ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article