Monday, February 16, 2026

Creating liberating content

తాజా వార్తలుఉప్పు వంక గ్రామానికి చెందిన ముగ్గురు పిల్లలు చెరువులో పడి మృతి..!

ఉప్పు వంక గ్రామానికి చెందిన ముగ్గురు పిల్లలు చెరువులో పడి మృతి..!

సంఘటన స్థలాన్ని పరిశీలించిన పాకాల సి.ఐ రాజగోపాల్..

చంద్రగిరి:
చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని, పాకాల మండలం, ఉప్పు వంక గ్రామానికి చెందిన పునీత్ కుమార్(11),తేజేశ్వర్(9),కన్నయ్య(9),స్కూల్ ముగించుకుని సోమవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో సమీపాన ఉన్న చెరువు వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన సంఘటనచోటుచేసుకుంది.దీంతో ఆ కుటుంబాలలో తీవ్రవిషాదంచోటు
చేసుకుంది..విషయం తెలుసుకున్న పాకాల సి.ఐ రాజ గోపాల్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని మృత్య దేహాలను పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అనంతరంచిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article