ప్రజాభూమి, విజయవాడ బ్యూరో:
2024 సంవత్సరానికి ఉత్తమ పర్యాటక గ్రామాలను ఎంపిక చేసి అవార్డులను అందజేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగనున్న ఈ కార్యక్రమానికి జిల్లాలో పర్యాటక గ్రామాల ఎంపికకు దరఖాస్తులు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉత్తమ పర్యాటక గ్రామాలకు సంబంధించి ఆయా గ్రామాలకు ఆనాధిగా వస్తున్న వారసత్వ పర్యాటకం, వ్యవసాయ పర్యాటకం, కళాఖండాలు, బాధ్యతాయుత పర్యాటకం, శక్తివంతమైన గ్రామాలు, పర్యాటకల ద్వారా గుర్తింపు పొందిన గ్రామాలు, కమ్యూనిటీ ఆధారితం, వెల్నెస్ రంగాలకు సంబంధించిన ఆయా గ్రామాల నుండి ఉత్తమ పర్యాటక అవార్డుకు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ధరఖాస్తులను www.rual.tourism.gov.in వెబ్ సైట్లో ఆన్ లైన్ ద్వారా నమోదు చేసుకోవచ్చునన్నారు. స్వీకరించిన ధరఖాస్తులను కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ పరిశీలించి ఉత్తమ పర్యాటక గ్రామ అవార్డులకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఇందులో గ్రామ, రాష్ట్ర జాతీయ స్థాయిలో ఉత్తమ పర్యాటక గ్రామాలుగా పురష్కారాలను అందజేస్తారన్నారు. ఇతర వివరాలకు 7093666022, 9700555116 నెంబర్లను సంప్రదించావచ్చునని కలెక్టర్ ఢిల్లీరావు ఆ ప్రకటనలో తెలిపారు.