ఉపన్యాసాలు మాత్రం బోలెడు..
వీరు చెప్పిందే కళ, వీరు చేసేదే కళ…
కళకు పరిపూర్ణ అర్థం తెలుసునా
పల్లవి,చరణం తెలియకపోయిన కళాసంస్థల అధినేత లా…
పద్యము, గద్యము తెలియని వారు కూడా..
తప్పులు లేనప్పుడు తడబాట్లు దేనికీ…
ఈ ఆదీపత్యం ఎన్నాళ్లు… ఈ బెదిరింపులు ఇంకెన్నాళ్లు…
విజయవాడ:కళ మన జీవితానికి అర్థాన్ని ఇస్తుంది మరియు మన ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఇది మన సంస్కృతిలో ముఖ్యమైన భాగం ఎందుకంటే మన భావోద్వేగాలను లోతుగా అర్థం చేసుకోవడానికి అనుమతిస్తుంది.ఇది మన స్వీయ-అవగాహనను పెంచుతుంది. కొత్త ఆలోచనలు, అనుభవాలకు మనలను తెరవడానికి అనుమతిస్తుంది.మాటలను అందంగా రాగ తాళ బద్ధంగా వినిపించడాన్ని పాట అంటారు. వీటిలో కొన్నింటిని గీతాలు, గేయాలు అని కూడా అనవచ్చును. పల్లవిఅంటే పాటలో మొదటి భాగం. ఇది ప్రతి చరణం తర్వాత మళ్ళీ పాడవలసి వుంటుంది.అనుపల్లవి అంటే పల్లవి తర్వాత పాడే మొదటి చరణం. చరణాలు పల్లవి తర్వాత పాడే భాగం. ఇవి సామాన్యంగా 3-5 ఉంటాయి.తాళం అనేది పాటకు సక్రమమైన చక్రం లాంటిది. ఇది పాటకు వాయిద్య రూపంలో అందే సహకారం. అఖండమైన కాలాన్ని, ఖండాలుగా చేసి హెచ్చు తగ్గులు లేకుండా నికరంగా జోడించి, శ్రోతలను తన్మయుల్ని చేయించగలిగేది తాళము. రాగము, తాళము మన కర్ణాటక సంగీతం యొక్క ప్రాణములు.భారతీయ సంగీతంలో కొన్ని స్వరాల సమూహము రాగం. రాగమనగా, స్వరవర్ణములచే అలంకరింబడి, జనుల హృదయాలను ఆనందింపచేయునట్టి ధ్వని.కర్ణాటక సంగీతంలో పల్లవి పాటలో ఒక నేపథ్య వరుస. జానపద సంగీతంలో కనిపించే అనేక అంశాలలో పల్లవి ఒకటి. అనుపల్లవి, చరణాలు ఇతర రెండు సాధారణ అంశాలు. ఇది కర్ణాటక పాటలలో, కీర్తన, కృతి, పాదం మొదలైన వాటిలో కనిపిస్తుంది. పల్లవి కర్ణాటక సంగీతములలో మాత్రమే కాకుండా, సమకాలీన శ్రావ్యమైన, భక్తి పాటలు, స్క్రీన్ ప్లేలలో కూడా ఒక అంశం. సాధారణంగా పల్లవి మొదటి వరుసలలో వస్తుంది, అందుకే దీనిని తమిళంలో పిక్, ఫస్ట్, ఫేస్ అని పిలుస్తారు. హిందూతాని సంగీతంలో దీనిని స్టై అంటారు. పాటల్లో మొదటి అంశంగా పల్లవి వస్తుండగా, అనుపల్లవి, చరణం అంశాల వెంబడి పల్లవి పదేపదే పాడటం జరుగుతుంది. పాటలో రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు పల్లవి రావటం వలన పాటలోని పల్లవి సంగీతాభిమానులకు బాగా గుర్తుండి పోతుంది. ఇది కేవలము కొంత విషయం మాత్రమే.ఇది కూడా తెలియక కనీస పరిజ్ఞానం తెలియక కులాలు, మతాలు అని చెప్పి కారు కూతలు కూయడం మాత్రం తెలుసు కుని హుంకార ఘీంకారా లతో బెదిరింపులకు దిగడం.కళ మీద స్పష్టమైన అవగాహన లేకుండా కలాన్ని అణిచివేయాలని చూడడానికి ఎన్నో కుట్రలు ,ఆ కుట్రల్లో ఏది పడితే అది వాగడం,తమ వాగ్దాటితో తప్పును ఒప్పు చేయడానికి ప్రయత్నం చేయడం ఇక్కడి తీరు. మహనీయులు sp బాలసుబ్రహ్మణ్యం ఈ లోకానికి ఎంతోమంది గాయని గాయకులను పాడుతా తీయగా తీర్చి దిద్దారు. సంగీత దర్శకుడు కోఠీ,చంద్రబోస్,గాయని సునీతలు గానం ఎలా ఉండాలి, వాటిలో మెలుకవలు నేర్పి పాటలకు జీవం పోస్తున్నారు.వీరంతా చేసింది ఉత్తమ గాయకులు పాడిన పాటలకే. ఇలాంటి వారిని కళామతల్లి బిడ్డలు,గాన గంధర్వులు అంటారు.ఇక్కడ ఆలపిస్తూంది ఆ గేయాలే.ప్రేక్షకులకు ఏమాత్రం ఉల్లాసాన్ని ఇస్తుంది అంటే అర్థం కానీ పరిస్థితి. స్వరగానార్చన లో సరిగమ పదనిసలు లేకుండా ఉన్నా సర్దుబాటు చేసుకోవాల్సిందే లేదంటే లోపాలు ఎత్తి చూపే వాడిదే తప్పు. ఇది కళను ప్రోత్సహించడం అంటారామరి. ఇలాంటి దుస్థితి మారుతుందా లేదో వేచిచూద్దాం.

