జగ్గంపేట
ప్రధాని నరేంద్రమోడీ గారు ప్రవేశపెట్టిన ఉజ్వల ఉచిత గ్యాస్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు జగ్గంపేట జడ్పీటీసీ ఒమ్మి బిందుమాధవి రఘురామ్ గారి స్వగృహంలో 50 మంది లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ కలెక్షన్ ను నిరుపేదలైన మహిళా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. జగ్గంపేట వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డా. ఒమ్మి రఘురామ్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదల మేలు కోసం ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టాయని అందులో భాగంగానే ఈ ఉచిత గ్యాస్ పంపిణీ గ్యాస్ బండ, స్టౌవ్ ,రెగ్యులేటర్ అన్నీ ఉచితంగా ఇవ్వడంతో పాటుగా పథకం ద్వారా 310/- సబ్సిడీ ప్రభుత్వం అందజేస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గొల్లపల్లి శ్రీనివాస్, జగ్గంపేట వై యస్ ఆర్ సేవాదళ్ కన్వీనర్ కిలపర్తి వీరబాబు, నీలపల్లి అప్పారావు జగ్గంపేట అంబేద్కర్ వాది వై సి పి నాయకులు,రెడ్డి బాను ప్రతాప్,దత్తి శ్రీనివాస్, పచ్చిపులుసు వీరబాబు, సాకా రాజకుమార్,కట్టు రాజు, మేడిశెట్టి బాలకృష్ణ,చెరుకూరి రాజు, కమ్మరి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు