*ఐఎఎస్, ఐపీఎస్ లు జైళ్లకు వెళుతుంటే…
*ప్రజాస్వామ్యం అపహాస్యం కాదా!
*ఛీఫ్ లిక్కర్ లో ఇన్ని చీఫ్ పనులు చేసారా…
*కాదంబరి కథలో కటకటాల్లోకి మాజీ ఇంటెలిజెన్స్ డిజి ..
*సీరియల్ లో ఐజి క్రాంతిరానా తాతా, డిఐజి విశాల్ గున్నీ..
- మరో ఐపీఎస్ పివి సునీల్ కు తప్పని తిప్పలు
- మరో ఐపీఎస్ కొల్లి రఘురామిరెడ్డి కి కూడా ఉచ్చు తప్పదేమో…
- సస్పెన్షన్ లో మరో ఐపీఎస్ సంజయ్
- ఐఏఎస్ వరుసలో మాజీ ఐఏఎస్ ధనుంజరెడ్డి..
- రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ ,మాజీ సీఎం ఒఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి కి బిగుస్తున్న ఉచ్చు…
- రాప్తాడు మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ వ్యవహారం లో బలి అయ్యేదెవరు..
- అసలు ఉద్యోగం లోఉండే దెవరు.. ఉడేదెవరు…
- రెడ్ బుక్ ఉచ్చులో చిక్కుకున్నదెంత మంది…
- ఈ తప్పు అధికారులదా… ప్రభుత్వాలదా..
- నాయకుల అడుగులకు మడుగులు వత్తడంతోనే ఇలా అవుతుందా..!
- ఎవరి బ్రతుకులకోసం ఈ దిగజారుడు వ్యవహారాలు
- నేటి బ్రతుకులను చూసి నవ్విపోతుంటే..
- పదవుల కోసం ఇన్ని పొరపాట్లు చేస్తారా…
- నాయకుల నాట్యంలో నాశనం అయ్యిందెవరు.. అయ్యేదెవరు…?
(రామమోహన్ రెడ్డి)
“సీకటమ్మ సీకటి ముచ్చటైన సీకటి
యచ్చనైన ఊసులెన్నో రెచ్చగొట్టు సీకటి
నిన్ను నన్ను రమ్మంది
కన్నుగొట్టి సీకటి
ముద్దుగా ఇద్దరికే ఒద్దికైన సీకటి
పొద్దు పొడుపేలేని సీకటే ఉండిపోని
మన మధ్య రానీక లోకాన్ని నిద్దరోని
రాయే రాయే రామసిలక
సద్దుకుపోయే సీకటెనక
నమ్మకు నమ్మకు ఈ రేయిని
కమ్ముకు వచ్చిన ఈ మాయని
కన్నులు మూసి
మత్తులోన మెత్తగా తోసి
నీ కన్నులు మూసి
మత్తులోన మెత్తగా తోసి
కలలే వలగా విసిరే చీకట్లను
వెన్నెలలోని మసకలలోనే
మసలును లోకం అనుకోకు
రవి కిరణం కనబడితే
తెలియును తేడాలన్ని
ఆకాశం తాకే ఏ మేడకైనా
ఆధారం లేదా ఈ నేలలో
పుడమిని చూడని కన్ను
నడపదు ముందుకు నిన్ను
నిరసన చూపకు నువ్వు ఏనాటికి
పక్కవారి గుండెల నిండా
చిక్కనైన వేదన నిండా
ఏ హాయి రాదోయి నీ వైపు
పదుగురి సౌఖ్యం పండే
దినమే పండుగ కాదా
నమ్మకు నమ్మకు
అరె నమ్మకు నమ్మకు
ఆహా నమ్మకు నమ్మకు ఈ రేయిని
అహ కమ్ముకు వచ్చిన ఈ మాయని
కన్నులు మూసి
మత్తులోన మెత్తగా తోసి
నీ కన్నులు మూసి
మత్తులోన మెత్తగా తోసి
కలలే వలగా విసిరే చీకట్లను
నమ్మకు నమ్మకు ఈ రేయిని
అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని”అని రుద్రవీణ సినిమాలో ఎంతో చక్కగా ఆలపించిన అందమైన పాటలోని కొన్ని చరణాల భావం అర్థం చేసుకుంటే నేటి ఐఏఎస్, ఐపీఎస్ ల జీవితాలు కూడా జైల్లో ఎందుకు మగ్గే పరిస్థితి వచ్చిందో.. ఇక మీదట ఎందుకు రాబోతుందో కూడా కాస్త అవగతం అవుతుందనేది చెప్పక తప్పడం లేదు.
నేడు నవ్యాంధ్రప్రదేశ్ లో నిత్యనూతనంగా మారుతున్న అధికారుల అరెస్ట్ ల పర్వాలు చూస్తుంటే ఆవేదన చెందాలా లేక ఆనందం వ్యక్తం చేయాలా అనే ప్రశ్నకు సమాధానం అనేది కాసింత ఆలోచింప జేస్తుంది. అవినీతిని అరికడుతున్నారా…లేక నాడు అన్యాయం చేశారనే దిశగా అడుగులు వేస్తున్నారా…లేక నాటి అంతులేని ఆవేదనకు తగిన చర్యలు చేపట్టారా అంటే అదికూడా సంక్లిష్టమైన ప్రశ్న గానే మిగిలిపోక తప్పదు.అయితే ఇక్కడ అధికారుల అత్యుత్సాహం కూడా లేకపోలేదన్న సత్యం కూడా కొంత
దాగిఉందని చెప్పాల్సిన పరిస్థితి దాపురించింది.తమ పదవుల కోసం తమ ప్రభువైన నాటిముఖ్యమంత్రి మెప్పు కోసం రాష్ట్ర ప్రయోజనాల కంటే వ్యక్తి పూజ లో నిమగ్నమయ్యారని తదనుగుణంగా నేడు ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి.ఇప్పటి వరకు జరిగిన ఐఎఎస్, ఐపీఎస్ అధికారుల అరెస్ట్ లు ఇక మీదట అరెస్ట్ కాబోతున్న ఐఎఎస్, ఐపీఎస్ అధికారుల ఆనాటి తీరు చూస్తే కొంత అసహనం వ్యక్తం చేయక తప్పని పరిస్థితి. నాటి వైసీపీ ఎంపి నేటి శాసనసభ ఉప సభాపతి రఘురామ కృష్ణంరాజు వ్యవహారం నుంచి ముంబై నటి కాదంబరి కేసు విషయంలో ఐపీఎస్ అధికారులు దిగజారి ప్రవర్తించారా అంటే అవుననే సమాధానం వెలువడుతుంది.ఆ తరువాత నేడు తెరమీదకు వస్తున్న లిక్కర్ స్కామ్ లో ఏకంగా మాజీముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి కూడామళ్లీ జైలు కూడు కొద్దో గొప్పో తినక తప్పదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఇదంతా కూడా రాజకీయ చదరంగంలో ఎవరికి వారు విచ్చలవిడి తనం ప్రదర్శించద
డముతోనే అన్నది జగమెరిగిన సత్యం. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన అవినీతి ఆరోపణల లో జైలు కెళ్లిన లిస్ట్ కంటే వైఎస్ జగన్ ప్రభుత్వ హయం లో జరిగిన అవినీతి ఆరోపణలలో జైలు కెళ్లే వారి జాబితా చాలా పెద్దదిగా ఉండటం విశేషం. గత సార్వత్రిక ఎన్నికల్లో అఖండ మెజార్టీతో ప్రభుత్వం చేపట్టిన తర్వాత పేద ప్రజల కు ఉచితాలు బాగా ఇచ్చామని దీనితో మరో ముప్పై ఏళ్ళు తమదే అధికారమని పదే పదే వైఎస్ జగన్ చెప్పడం ప్రతిపక్ష పార్టీకి ఎక్కడ కూడ అనువంత అవకాశం ఇవ్వకుండా ఉండటం తో ఈ అధికారులు కూడా అధికారం అన్నది శాస్వితమని భావించి అడ్డదిడ్డంగా వ్యవహరించడం కూడా నేటి ఈ పరిస్థితి దాపురించడం జరిగిందని చెప్పాలి. కలుషితమైన రాజకీయ వ్యవస్థ లో ప్రజాస్వామ్య వ్యవస్థ అపహాస్యం అవ్వడమనేది ఎప్పుడు మొదలు కాబడిందో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో దేని దౌర్భాగ్య పరిస్థితి నవ్యాంధ్రప్రదేశ్ లో చోటు చేసుకున్నాయని చెప్పాల్సి వస్తుంది. ప్రజాజీవితం లో ప్రజాప్రయోజనాల కోసం పనిచేయాల్సిన ప్రజాప్రతినిధులు ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ఎప్పుడు పనిచేయడానికి సిద్ధపడ్డారో అప్పుడే ప్రజాస్వామ్య మన్నది పరిహాసంగా మారింది. దేశంలో ను అత్యున్నత స్థాయి పరీక్షలు రాసి ఉన్నతమైన ఉద్యోగం లో ఉండి నేతల అడుగులకు మడుగులు ఒత్తి వారి మూతులు నాకడం మొదలు పెట్టారో అప్పుడే వారి గోతులు వారు తీసుకున్నారనేది నిత్య సత్యం. అధికార మధం అన్నది ఆశాశ్విత మన్నది ఆలోచన చేయక అడ్డదిడ్డంగా అన్యాయపు పనులు చేయడం మూలాన ఆ పనులు అప్పుడు న్యాయమని అనుకున్నా నేడు అన్యాయం గా అనిపించి అరెస్ట్ ల దాకా వెళ్లడం చూస్తే అధికారులు కూడా అనాలోచితంగా వ్యవహరించారని ఆనాల్సివస్తోంది.
సార్వత్రిక ఎన్నికల్లో చెప్పిన విదంగా రెడ్ బుక్ లో ఇంకెన్ని పేజీలు మిగిలిఉన్నాయో తెలియదు కానీ ఈ రాష్ట్రం ఎటూ పోతుందా భవిష్యత్ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో అన్న ఆలోచన చేయాలన్న అది సాధ్యం కాదని తెలుస్తోంది.