Thursday, September 18, 2025

Creating liberating content

తాజా వార్తలుఈస్టర్ వేడుకల్లో చిన్న సంఘంలో పెద్ద పాస్టర్రెవరెండ్. గోన.ప్రభాకరరావు

ఈస్టర్ వేడుకల్లో చిన్న సంఘంలో పెద్ద పాస్టర్రెవరెండ్. గోన.ప్రభాకరరావు

హనుమంతునిపాడు :హనుమంతునిపాడు మండలంలోని వీరరామాపురం గ్రామంలో జరిగిన ఈస్టర్ పండుగ వేడుకల్లో రెవరెండ్ గోన.ప్రభాకరరావు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దయామయుడు, కారుణామయుడు, ప్రేమస్వరూపి, శాంతిధూత మృత్యుంజయుడు యేసుక్రీస్తు బోధనలు ప్రపంచంలోని సర్వ సమస్త మానవాళికి అనుసరణీయమని తెలిపారు. పరిశుద్ధ గ్రంథంలోని లేఖనములు నెరవేర్చుటకు పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ భూలోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాల జీవించారని అందులో ముప్పై సంవత్సరాలుగా తన కుటుంబానికి అండదండగా ఉండి కేవలం మూడున్నర సంవత్సరాల కాలంలో ఏసుక్రీస్తు అద్భుత కార్యాలు, ప్రసంగాలు, బోధనలు రోగులను స్వస్థ పరచటం చనిపోయిన వారిని బ్రతికించటం,గ్రుడ్డి వారికి చూపు నివ్వటం కుంటి వారికి కాళ్ళనిచి నడిపించడం కుష్టు రోగులను స్వస్థ పరచటం ఇలా మహత్కార్యాలు చేశారన్నారు. పాపక్షమాపన నిమిత్తం ఏ పాపం ఎరుగనటువంటి యేసుక్రీస్తు నీ కోసం నా కోసం మనందరి కోసం కల్వరి గిరిపై శిలువ మ్రానుమీద కాళ్లు చేతులలో మేకులు కొట్టబడి తలపై ముళ్ల కిరీటం పెట్టబడి ప్రక్కలో బల్లెంతో కుచ్చబడి ముఖంపై ఉమ్మి వేయబడి కొరదాలతో కొట్టబడి హింసించబడి అవమానించబడి, హేళన చేయబడినారన్నారు. అటువంటి సమయంలో కూడా “తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము” (లూకా 23:34) అని పలికిన ప్రేమామయుడు యేసుక్రీస్తు అని అటువంటి దేవుడిని ఆరాధించే మనమంతా ధన్యులమని అన్నారు. ముప్పై మూడున్నర సంవత్సరాల కాలంలో మూడున్నర సంవత్సరాల యేసుక్రీస్తు బోధనలు తరతరాలుగా వేల సంవత్సరాలుగా ప్రవచిస్తున్నామని ఆచరిస్తున్నామని ఆయనను ఆరాధిస్తున్నామని చెప్పారు. ఈ భూప్రపంచంలో ఎందరో చక్రవర్తులు రాజులు పాలించిన హిట్లర్, అలెగ్జాండర్ వంటి చక్రవర్తులకు లేని ఘనత మహాత్మా గాంధీజీ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కు దక్కిందంటే వారు శాంతి స్వరూపులని మిత వాదులని యేసుక్రీస్తు బోధనలు పాటించేవారని తెలియజేసారు. యేసుక్రీస్తు మరణించి మూడవ దినమున తిరిగి లేచారని మరణపు ముళ్ళు విరిచిన మృత్యుంజయుడు లేచిన తరువాత 40 రోజులు భూమి మీద ఆత్మస్వరూపిగా ఉండి అటుపిమ్మట ఆరోహణమయ్యారని చెప్పారు. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు వేరే మార్గము లేదని తెలిపిన మహోన్నతమైన మార్గదర్శి యేసుక్రీస్తు అని పలికారు.

అన్యులకు ధన్యులకు తేడా తెలియాలని మనుష్యులను సృష్టించిన జీవము గల దేవుని ధన్యులు ఆరాధిస్తున్నామని మనుషులు చేసిన బొమ్మలను, చెక్కిన విగ్రహాలను అన్యులు పూజిస్తున్నారని తెలిపారు. శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషం తొలగించుకుని పరిపూర్ణ పరిశుద్ధ జీవితం గడపాలని తెలిపారు. సంఘ కాపరులు కొండెపోగు చిన్న నాగయ్య కొండెపోగు పెద్ద సమూయేలు మాట్లాడుతూ మా చిన్న సంఘమునకు పెద్ద పాస్టర్ రెవరెండ్ గోన.ప్రభాకరరావు ఈస్టర్ వేడుకల్లో పాల్గొనటం ఆనందంగా ఉందన్నారు. విదేశాల్లో సువార్త ప్రకటించేవారు కావటం, భారతదేశంలో 18 రాష్ట్రాల్లో పరిచర్య చేస్తుండటం తెలుగు రాష్ట్రాలలోని 57 జిల్లాల్లో సువార్త ప్రకటించే రెవరెండ్ గోన.ప్రభాకరరావు స్వగ్రామం మన వీరరామాపురం కావటం గర్వ కారణమని తెలిపారు. ఈస్టర్ వేడుకలు అనంతరం ప్రేమ విందు జరిగినది. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు గోన ఆదాము కొండెపోగు ఇశ్రాయేలు గోన ఇస్సాకు గోన నాగయ్య గోన ఇస్మాయేలు కొండెపోగు రోహిత్ విశ్వాసులు కొండెపోగు రాబర్ట్ గోన అంథోని కొండెపోగు చిన్న సామేలు కొండెపోగు మోషే కొండెపోగు యోహాను సరోజమ్మ సిసింద్రీ కొండెపోగు శాంతి గోన విజయమ్మ సుగుణమ్మ స్వర్ణలత అశ్విని గ్రేస్ మేరీ ఆదిలక్ష్మి కొండెపోగు వజ్రమ్మ అస్మిత మరియమ్మ రూతమ్మ స్రవంతి మరియమ్మ కుమారి అఖిల గోన సంగీత జస్మిత విజయ్ నందు యశ్వంత్ సాత్విక్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article