శ్రీ సత్య సాయి జిల్లా:జిల్లాలోని నియోజకవర్గ కేంద్రమైన పెనుకొండ పట్టణానికి ఈనెల7వ తేదీన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విచ్చేయనున్నట్లు పెనుకొండ టిడిపి అభ్యర్థి సవిత తెలియజేశారు. మంగళవారం పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అమె మీడియా సమావేశంలో మాట్లాడారు.
నిన్నటి రోజున రా కదలిరా సభకు నియోజకవర్గంలోని నలుమూలల నుండి వేలాది మంది కార్యకర్తలు నాయకులు తరలివచ్చి సభను విజయవంతం చేసే ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు శంఖారావం సభకు లోకేష్ విచ్చేయనున్న సందర్భంగా సభకు వేలాదిమంది స్వచ్ఛందంగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని టిడిపి శ్రేణులకు ఆమె విజ్ఞప్తి చేశారు పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం పక్కలో ఉన్న ఖాళీ స్థలాన్ని శంఖారావం సభకు నిర్ణయించారు. ఆమె వెంట తెలుగుదేశం నాయకులు రాంపురం సర్పంచ్ శ్రీనివాసులు పార్టీ మండల కన్వీనర్ శ్రీరాములు మాజీ జెడ్పిటిసి వెంకటరమణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వెంకటేశ్వరరావు లలు పాల్గొన్నారు