చంద్రగిరి:చంద్రగిరిశ్రీకోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 16వ తేదీ సాయంత్రంఅంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.
ఇందులో భాగంగా ఏప్రిల్ 17వ తేదీ ఉదయం 9.05 నుండి 10 గంటల మధ్య ధ్వజారోహణంనిర్వహిస్తారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 7.30 గంటల వరకుశ్రీకోదండరామస్వామివారుహనుమంతవాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వ నున్నారు.ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 10 నుండి 11.30 గంటలవరకుశ్రీసీతారాములకల్యాణోత్సవం,సాయంత్రం 6.30 నుండి రాత్రి 7.30 గంటల వరకు గరుడ వాహనంపై స్వామివారు ఉరేగుతూ భక్తులను కటాక్షించనున్నారు. రూ.750/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. ఏప్రిల్ 25వ తేదీ ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సర్లకు, చక్రత్తాళ్వార్‌కు స్నపన తిరుమంజనం, ఉదయం 10.30 నుండి 11 గంటల వరకు చక్రస్నానం వైభవంగానిర్వహించనున్నారు. సాయంత్రం 6.30 గంటలకుధ్వజావరోహణముతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.ఏప్రిల్ 26వ తేదీ ఉదయం 9 నుండి 10.15 గంటల వరకు శ్రీ రామపట్టభిషేకం వైభవంగా నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో హరికథలు, భజనలు, సంగీత కచేరీలు నిర్వహించనున్నారు.
