జగ్గంపేట
జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామంలో నెహ్రూ స్వగృహ నందు జగ్గంపేట నియోజకవర్గం టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూకు ఇర్రిపాక గ్రామానికి చెందిన సేనాపతి కులం నుంచి మే 13న జరుగుతున్న ఎన్నికల్లో జ్యోతుల నెహ్రూ కి పనిచేసి సైకిల్ గుర్తుకు ఓటేసి ఆఖండ మెజార్టీ తీసుకొస్తామని మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో మా గ్రామానికి మంచి గుర్తింపు తెచ్చిన నాయకుడు జ్యోతుల నెహ్రూ అని ఎక్కడికెళ్లినా ఇర్రిపాక గ్రామం అంటే ప్రత్యేక గౌరవాన్ని ఇస్తారని ఆ గౌరవం మాకు జ్యోతుల నెహ్రూ వల్లే వచ్చిందని ఈ ఎన్నికల్లో ఆయనను గెలిపిస్తామని గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి మా వంతు సహకార అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇర్రిపాక గ్రామ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.