జగ్గంపేట
జగ్గంపేట మండలం ఇర్రిపాక శివాలయం వద్ద జ్యోతుల నెహ్రూ, జ్యోతుల మణి కుటుంబం అత్యంత వైభవంగా భారతదేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రతిష్ట మహోత్సవం నిన్నటి రోజు అంకరార్పణ చేశారు. సోమవారం 10 గంటలకు మండప పూజ ప్రారంభించి, గోపూజ, క్షీరాదివాసం మొదలగు పూజలు నిర్వహించారు. 13వ తేదీ కూడా అదివాసాలు నిర్వహించి 14వ తేదీ ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రతిష్ట జరుగుతుందని జ్యోతుల నెహ్రూ తెలియజేశారు. ప్రతిరోజు జరిగే ఈ కార్యక్రమాలకు భక్తులందరూ హాజరై ఆ శివుడి కృపకు పాత్రులవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు టిడిపి ఇన్చార్జ్ వరుపుల సత్య ప్రభ, అడబాల భాస్కరరావు, జ్యోతుల లక్ష్మీదేవి, జ్యోతుల అనీష్ నెహ్రూ, సుంకవిల్లి రాజు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.