పేద కళాకారులపై అంత చిన్న చూపులేల
పాట పాడాలని పిలిపించి అవమానించడమా
ఆపై బెదిరింపులకు దిగడం కూడానా
గొప్ప కళా సంస్థ అని చెప్పుకోవడమేనా
ఓ మహిళ పట్ల మరో మహిళ చిందులేయడమా
కళల కోసమే సంస్థ ఏర్పరచిన కళాధినేత కూడా కారు కూతలేల…
సాధన కోసం వచ్చిన ఓ న్యాయవాది ముందే ఇలానా..
మరి వీరంతా కళామతల్లి బిడ్డలేనట…
కలలను ఉద్ధరించడానికే వీరున్నారట…
వీరి భాగోతం సుదూరానా ఉన్న నటులకు తెలియదు గా…
నకీల అవార్డులు వారికి తెలియదు గా. .
ఎవరి మెప్పు,ఒప్పు కోసం ఈ పై పై నాటకాలు
వీరే పెద్ద నటులని ఆ నటీమణులకు తెలియదు కాబోలు…
విజయవాడ:ఆహా వీరే కళామతల్లి ముద్దు బిడ్డలు.కలలను బ్రతికించాలని వీరే బ్రతుకులనే త్యాగం చేయ డానికి కూడా వెనుకాడటం లేదంట. కళను బ్రతికించు కోవడానికే ఓ మహనీయుడు పదునాలుగు ఎకరముల పొలము అమ్మినాడట. అందుకే ఏర్పడిందట ఆ కళా సంస్థ. ఇంకోకరు అయితే తమ జీవితాన్నే ఫణంగా పెట్టి వేల కార్యక్రమాలు చేస్తున్నారట. నీకు మూడు వేలు నాకు ఆపై ఎంతయినా నీకు ఓకే అంటే కూడా కేవలం కళామతల్లి ఎక్కడ కళను కోల్పోతుందని ఒప్పుకున్నదట. ఇదంతా పేద కళా కారుల కోసం ఎన్నో కష్ట నష్టాలు భరిస్తున్న కొన్ని కళాసంస్థల అధినేతల తీరట.ఇది కళామ తల్లి ముసుగులో పెద్ద పెద్ద హోదా కలిగిన వారిని మెప్పించి తమ గొప్పలు చెప్పుకుంటూ ఓ రకమైన దనార్జనే ధ్యేయంగా సమాజంలో గొప్ప వారిలా ముసుగు వేసుకున్న కొందరి తీరు. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు కూడా భాగస్వామ్యం అవ్వడం అచ్చర్యానికి గురి చేస్తున్నాయి.
ఇలాంటి క్రమంలో ఓ న్యాయవాది సంగీతం మీద మక్కువతో ఓ చోటికి రావడం అక్కడ ఆయన్ను మంచిచేసుకొని మెప్పు పొందడానికి పేదకళాకారులను తక్కువ చేసి మాట్లాడిన ఉదంతం ఆలస్యంగా ప్రజాభూమి పరిశోధనలో తేటతెల్లం అయింది. అక్కడ జరిగిన ఉదంతం చూస్తే వీరు కళామతల్లి కి జీవం పోస్తున్నామని చెపుతూ పేద కళాకారుల పై ఇంతటి అభిమానం ప్రదర్శిస్తున్నారో అర్థం అయింది. ఇందులో ఓ మహిళా మణి కూడా ప్రమేయం కూడా ఉండటం ఇంకా అచ్చర్యానికి గురిచేస్తోంది.మరి ఇలాంటి దుస్థితి నుంచి పేద కలాకారులకు ఎప్పుడు స్వాంతన చేకూరుతుందో వేచి చూడాల్సిందే.