గొల్లప్రోలు :గొల్లప్రోలులో ని శ్రీ విశ్వనాథ సత్యసాయి ఇండేన్ గ్యాస్ ఏజెన్సీస్ డిస్ట్రిబ్యూటర్ అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ లు ఆధ్వర్యంలో గొల్లప్రోలు మండల తహశీల్దార్ వారికి ఏఐఎఫ్ టు యు ఉమ్మడి జిల్లా అధ్యక్షు లు కుంచె అంజిబాబు, ఏపీ ఆర్ సి ఎస్ జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజబాబు లు ఆయా సంఘాల శ్రేణులతో కలిసి వినతి పత్రం అందజేశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని శ్రీ విశ్వనాథ సత్యసాయి ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ డిస్ట్రిబ్యూటర్ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉజ్వల పథకంలో ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇవ్వవలసి ఉండగా ఎటువంటి రసీదు ఇవ్వకుండా అదనంగా లబ్ధిదారుల వద్ద నుండి 300 రూపాయలు వసూలు చేస్తున్నారని, హోటల్స్ కి డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తూ అక్రమ సంపాదన ఆర్జిస్తున్నారని విమర్శించారు. ఈ విషయంపై జిల్లా యంత్రాంగం జోక్యం చేసుకొని విచారణ జపించి, గ్యాస్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్ పై చర్యలు తీసుకుని, లబ్ధిదారులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చార్లెస్, వీరన్న, సత్తిబాబు, గొర్ల శివ, బల్ల సోమరాజు తదితరులు పాల్గొన్నారు.