సచివాలయాల వద్దనే పింఛన్లు పంపిణీ అని సర్కులర్ జారీ చేసిన సెర్ప్ సీఈవో ఆదేశాలు రద్దు చేయాలి :కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు జి శ్రీరాములు
కడప సిటీ :కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గుండ్లకుంట శ్రీరాములు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏప్రిల్, మే, జూన్ నెలలకు పింఛను దారులకు సామాజిక భద్రత పింఛన్లు వాలంటీర్ల ద్వారా పంపిణీ నిలుపువేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చినందున సచివాలయాల వద్ద కాకుండా లబ్ధిదారుల వద్దకే వెళ్లి పింఛన్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గుండ్లకుంట శ్రీరాములు ప్రభుత్వాన్ని కోరారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని పింఛన్ పంపిణీలో ఒక సచివాలయంలో పది మంది సెక్రటరీలు సిబ్బంది గా ఉన్నారు కాబట్టి ఒక్కొక్క సెక్రటరీకి కనీసం 50 మంది పెన్షన్ డార్లింగ్ అప్పజెప్పి చేస్తే వాలంటరీ కన్నా కూడా వీళ్లు బాధ్యతగా ఇస్తారని చెప్పే శని ఆయన సంబోధించారు.ఈ విధంగా వాడుకుంటే పింఛన్లు ఒకరోజులో ఇవ్వటానికే కాకుండా ప్రతి ఒక్క పింఛనుదారుడుకి సక్రమంగా అమౌంట్ అందుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వము యొక్క సూచనని పరిగణలో తీసుకుని ఏప్రిల్ మే జూన్ నెలలో ఎలక్షన్ కూడా అయ్యేంతవరకు ఈ సిబ్బందిని వాడుకోవాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పించను దారుల వివరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నప్పుడు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్(డిబిటి)ద్వారా పింఛన్లు ఒక్కరోజులో పంపిణీ చేయొచ్చు కదా?అని శ్రీరాములు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిబంధనల విరుద్ధంగా వాలంటీర్ల వ్యవస్థను అధికార పార్టీ వాడుకోవడాన్ని ఎన్నికల సంఘం నియంత్రించడం శుభ పరిణామమని అని వ్యాఖ్యానించారు.