Thursday, May 8, 2025

Creating liberating content

తాజా వార్తలుఇంటి పట్టా ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలి :కలెక్టర్ పి అరుణ్ బాబు

ఇంటి పట్టా ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలి :కలెక్టర్ పి అరుణ్ బాబు

శ్రీ సత్య సాయి జిల్లా

గ్రామ వార్డు సచివాలయాల్లో ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్లు వేగవంతం చేయాలని కలెక్టర్ పి అరుణ్ బాబు
అధికారులను ఆదేశించారు.
బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి టెలికాన్ఫరెన్స్లో సంబంధిత అధికారులతో పలు అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. పేదలందరికీ ఇల్లు పథకం కింద లబ్ధిదారుల ఇళ్ళ స్థలాల రిజిస్ట్రేషన్ కార్యక్రమం అన్ని గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో జరగవలసి ఉందన్నారు. అయితే కొన్ని చోట్ల డేటా వివరాలు లేనందున ఇంకా మొదలు కాలేదన్నారు. జిల్లాలో 253 గ్రామాలలో,34 353 వేల మంది లబ్ధిదారులకు గాను ఇప్పటివరకు 5285 రిజిస్ట్రేషన్లు జరిగాయన్నారు. సంబంధిత ఆర్టీవోలు
తహసిల్దార్లు ఎంపీడీవోలు మునిసిపల్ కమిషనర్లు వారి పరిధిలో ఉన్న గ్రామ వార్డు సచివాలయాలను సందర్శించి అక్కడ రిజిస్ట్రేషన్ పనులు ఎలా జరుగుతున్నాయి గమనించాలని, ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకుని తమ దృష్టికి తీసుకొని రావాలన్నారు. జిల్లాలో ఈరోజు 9 వేల ఇంటి పట్టా లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు . ప్రక్రియలో భాగంగా మండలాల ప్రత్యేక అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు అలాగే కుల గణన జిల్లాలో 95% పూర్తిచేయాలని అధికారులు ఆదేశించారు. సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి కుల గణన కార్యక్రమం చేపట్టాలని, ప్రత్యేక మొబైల్ యాప్ లో పొందుపరచాలని వెల్లడించారు. సో మందపల్లి, గాండ్లపెంట ,నల్లమడ, హిందూపూర్ అర్బన్, పుట్టపర్తి అర్బన్ మండలాలలో కుల గణన కార్యక్రమం లో వేగవంతం చేయాలని తెలిపారు. అదేవిధంగా జిల్లాలో 35 వేల ఓటర్ల క్లెయిమ్స్ ఉన్నాయని వాటిని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని అందుకు బి ఎల్ వోలు కృషి చేయాలని తెలిపారు. ఇప్పటికే కొంతమంది బిఎల్ఓ లకు షోకాజ్ నోటీసులు అందజేయడం జరిగిందని,క్లెయిమ్స్ పట్లనిర్లక్ష్యం వహించిన బిఎల్ఓపై క్రిమినల్ చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. క్లెయిమ్స్ ఏవైనా తొలగించాలంటే కచ్చితంగా జిల్లా ఎన్నికల అధికారి దృష్టికి తీసుకుని పోయి వారి అనుమతితో తొలగించాలని తెలిపారు. క్లైములు ఆడిషన్ చేయాలన్న నియోజకవర్గ ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో అన్ని రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించి అడిషన్ కార్యక్రమం పూర్తిచేయాలని తెలిపారు.
టెలికాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ డిఆర్ఓ కొండయ్య, పెనుకొండ సబ్ కలెక్టర్ అపూర్వ భరత్, కదిరి, ధర్మవరం, పుట్టపర్తి ఆర్డీవోలు, తహసీల్దారులు, ఎంపీడీవోలు మున్సిపల్ కమిషనర్లు, మండలాల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article