*అనుమతులు ఎంత చక్కగా అమలు పరిచారోగా…
*ప్లాన్ పక్కాగా ఈ బిల్డింగ్ కు ఉన్నట్లేనా…
*ఆ ఉండే ఉంటదిలే లేదంటే మేడమ్ తప్పును ఒప్పుకోదుగా…
*అసలు సిటీ ప్లానర్ అయితే చాలా నిక్కచ్చిగా ఉంటాడంటా…?
*పురపాలక కమిషనర్ కు కూడా ఫైల్ చక్కగా పంపారట..
*అందుకే ఆ యజమాని అమ్యామ్యా ఇచ్చారని అంటున్నారోచ్…
*అన్ని అనుమతులున్నా అక్షరాల లచ్చలు ఇచ్చకోవాలని అంటున్నారోచ్…
*ఇదేమి రాజ్యం రా అయ్యా అంటుంటే ..
*విజనరి ముఖ్యమంత్రి కే కొత్త విజన్ చూపిస్తున్నారనే టాక్ వస్తుంటే…
*ఇలాంటి అధికారులు అమరావతిలో ఉంటే బాగుండేదని గుసగుసలు వినిపిస్తున్నాయోచ్..
*కొమ్ముల వల సెంటర్ అంబికా టీ స్టాల్ పక్కన కొత్త బీల్డింగ్ ఎంత బాగుందో …!
*ఇదేమరి బెజవాడ పశ్చిమ నియోజకవర్గ టౌన్ ప్లానింగ్ అధికారుల గొప్పతనం మరీనూ…
*చూతము రారండి ఈ అందమైన నిర్మాణాలు…
*ఇంకా ఉందండోయ్ చాలానే..
(రామమోహన్ రెడ్డి)
నవ్వి పోదురు గాక నాకేల సిగ్గు అన్న చందాన నాలుగు కాసుల కోసం అక్రమంగా కడుతున్న బీల్డింగ్ నిర్మాణాల ను ఆపవలసిన అధికారులు అవైపు కన్నెత్తి చూడకుండ ఉంటున్నారనే విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి.అమరావతి రూపశిల్పీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజధాని అభివృద్ధి చేస్తున్న నేపధ్యంలో రాజధానికి అనుసంధానం గా ఉన్న విజయవాడ నగరం కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. అందులో భాగంగా అనేక నిర్మాణాలు చేపడుతూ ఉన్నారు. అయితే ఏ నిర్మాణం ఎలా చేపట్టాలనే విధి విధానాలు రూపొందించి అందుకు తగ్గ అనుమతులు ఇవ్వడానికి కార్పొరేషన్ పరిధిలో పట్టణ ప్రణాళిక విభాగం అనేది ఉంది.కేవలము ఈ నిర్మాణాల్లో ఎలాంటి లోపాలు లేకుండా చూసేందుకు ఒక అధికార వ్యవస్థ ను ఏర్పాటు చేసి హాయిగా ఏసీ గదుల్లో కూర్చో బెట్టి లక్షల రూపాయలు జీతాలు చెల్లిస్తున్నారు.అయితే ప్రభుత్వం ఇచ్చే జీతం సరిపోక ఎంత బాధలు పడుతున్నారో తెలియదు గాని నిర్మాణాలను సక్రమం చేయాల్సిన ఈ అధికారులు అక్రమం చేస్తూ అప్పనంగా దోచుకుతింటున్నారు.అందుకు నిదర్శనం గా నిర్మిత మైన ,నిర్మితమైన కట్టడాలను చూస్తే అట్లే అర్ధమవుతుంది.
ముఖ్యంగా బెజవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని వన్ టౌన్ కొమ్మలవల సెంటర్ అంబికా టీ స్టాల్ పక్కన నిర్మాణం చూస్తె సంబందిత టౌన్ ప్లానింగ్ అధికారుల తీరు అట్లే అర్దవుతుంది. ఈ నిర్మాణం ఒక్కటే నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి మిగిలిన నిర్మాణాలు సక్రమమా అంటే పరిశీలిస్తే వీరి అవినీతి బాగోతం బైట పడుతుంది. మరి పరిశీలించాల్సిన పై అధికారులు పక్కదారి పడుతున్నారనే చెప్పాలి.విజిలెన్స్ అధికారులా అంటే వారు కూడా ఈ సమాజంలో ఒక భాగం కాబట్టి ఈ అవినీతి లో వారు కూడా కొంత భాగం పంచు కోకుండా ఎందుకు మౌనంగా ఉంటారన్న ఆరోపణలు లేక పోలేదు.అలా కాకపోతే ఈ స్థాయిలో అవినీతి జరుగుతున్నా అటు వైపు కన్నెత్తి చూడలేని దౌర్భాగ్య స్థితిలో కార్పొరేషన్ ప్రజలు బ్రతుకుతున్నారంటే ఎవరిని నిందించాలా అర్థం కాని పరిస్థితి. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లొ కళ్లెదుటే ఇంత అన్యాయం జరుగుతుందని పత్రికలు ఘోషిస్తున్న నేరుగా ఫిర్యాదులు ఇస్తున్న పట్టించుకున్న పాపాన పోలేదన్నది అక్షర సత్యం గా నిలుస్తోంది. సమ సమాజ స్థాపనలో క్రియాశీలకంగా ఉండాల్సిన వ్యవస్థలు గాడి తప్పినప్పుడు ఆ లోపాలను ఎత్తి చూపి మార్గ నిర్దేశించాల్సిన నాలుగో స్తంభం ఆయిన పత్రికా వ్యవస్థ లోప భూయిష్టంగా ఉండడం రోజు రోజుకు పత్రికా విలువలను దిగజార్చే పనికిమాలిన వ్యక్తులు ఈ వ్యవస్థలోకి చొర బడడం కారణంగా ప్రబుత్వ అధికారులు కూడా పనికిమాలిన దర్మానికి ఒడిగట్టి నీతి న్యాయం ధర్మమన్నవి అంగడిలో సరుకులు గా మార్చి వారి సంచులు నింపుకొనే పనిలో నిమగ్నమయ్యారని చెప్పక తప్పడం లేదు.ఇలాంటి పరిస్థితుల్లో పురపాలక కమిషన్ అయిన ఈ అవినీతి అక్రమాలపై చర్యలు చేపట్టి భాద్యులపై చర్యల తీసుకుంటారన్న ఆలోచన చేయాల్సి వస్తోంది.
