టి.నరసాపురం.
ఆశ వర్కర్లు తమ సమస్యలను
పరిష్కరించాలని కోరుతూ నిరసన తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు.
మండలంలోని ఆశ వర్కర్లు తమ విధులను బహిష్కరించి టీ నర్సాపురం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద నిరసన తెలిపారు అనంతరం ఆరోగ్య కేంద్రం వద్ద నుండి స్థానిక అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం ప్రధాన సెంటర్లో మానవహారంగా ఏర్పడి తమ సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఆశ వర్కర్ల నాయకులు మాట్లాడుతూ ఆశ వర్కర్ల న్యాయమైన కోరికలను వెంటనే పరిష్కరించాలని అక్రమంగా అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేసి వారిపై ఉన్న కేసులను ఎత్తివేయాలని తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి సంక్షేమ పథకాలు కల్పించాలని రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలని పని భారాన్ని తగ్గించాలని చాలీచాలని జీతంతో పనిచేస్తున్నామని జీతాలు పెంచాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్ల నాయకులు ఎలమంచి విజయలక్ష్మి నార్లపాటి జ్యోతి వనిత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు