గండేపల్లి
రాష్ట్ర ప్రభుత్వం ఆశ వర్కర్లకు ఇచ్చిన హామీలు తమ డిమాండ్స్ నెరవేర్చకపోగా ఉక్కు పాదం మోపడం సరికాదని ఆశా వర్కర్ల యూనియన్ సభ్యులు తెలిపారు. 8 వ తారీఖున తమ డిమాండ్స్ కొరకు చలో విజయవాడ వెళ్తున్న ఆశ వర్కర్లను ప్రభుత్వం పోలీసులతో నిరంకుసంగా వ్యవహరించిన తీరుపై శుక్రవారం స్థానిక తహాసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టిన అనంతరం తహాసిల్దార్ చిరంజీవికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన జీవో ప్రకారంగా జీతాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని తమ డిమాండ్స్ నెరవేర్చాలని కోరుకుంటూ రెండు రోజులు పాటు నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ల మండల సంఘ అధ్యక్షులు లలిత,దివ్య శాంతి, తదితరులు పాల్గొన్నారు.