Friday, November 14, 2025

Creating liberating content

తాజా వార్తలుఆర్ అండ్ ఆర్ కాలనీలో వసతులలేమితో మగ్గుతున్న కొండరెడ్డి గిరిజనులు

ఆర్ అండ్ ఆర్ కాలనీలో వసతులలేమితో మగ్గుతున్న కొండరెడ్డి గిరిజనులు

** కొల్లూరు, కొండేపూడి, తమ్మిలేరు, పోచవరం గ్రామాలకు చెందిన కొండరెడ్డి గిరిజనులు ఆర్ అండ్ ఆర్ కాలనీలలో పునరావాసం.
** సిసి రోడ్లు కానీ, డ్రైనేజీల సౌకర్యం కాని, ప్రభుత్వ భవనాలు కానీ లేవు.
** ఎక్కడ చూసినా బురద గోతులు దర్శన మిస్తున్న వైనం.
** కట్టిన ఇళ్లు, మరుగుదొడ్లు నాణ్యతా లోపంగా ఉన్నాయి.
** దురదృష్టవశాస్తూ ఎవరైనా పోతే దహన సంస్కారాలకు స్మశాన వాటికను కూడా నిర్మించలేదు.
** ఆర్ అండ్ ఆర్ కాలనీలో అన్ని వసతులు కల్పిస్తే మిగతవారంత కాలానికి వెళ్లి అవకాశం ఉంది.

వి.ఆర్.పురం :పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో నిర్వాసితులవుతున్న తమ్మిలేరు పంచాయతీలోని కొండరెడ్డి గిరిజనులకు ప్రభుత్వం ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం రామన్నగూడెం గ్రామం పరిధిలో నిర్మించిన ఆర్అండ్ఆర్ కాలనీలలో నివసిస్తున్న మండలానికి చెందిన కొండరెడ్డి గిరిజనులు అక్కడ సౌకర్యాల లేమితో నానా అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు. మండలంలోని తుమ్మిలేరు పంచాయతీ పరిధిలోని కొల్లూరు, కొండేపూడి, తమ్మిలేరు, పోచవరం గ్రామాలకు చెందిన కొండరెడ్డి గిరిజనులకు, దాదాపు 140 కుటుంబాలు సంవత్సర కాలంగా అక్కడ నివాసం ఉంటున్నారు. ప్రభుత్వం ఈ నాలుగు గ్రామాల ప్రజలకు 562 ఇళ్లను ఇక్కడ నిర్మించారు, వాటిలో 140 కుటుంబాల వారే ఇక్కడ ప్రస్తుతం నివసిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు ఆర్ అండ్ ఆర్ కాలనీలకు వెళ్లాలని, అక్కడ మీకు అన్ని వసతులు కల్పిస్తామని మమ్మల్ని ఇక్కడికి పంపించారని, ఇక్కడ చూస్తే కనీస వసతులు లేక మేము కొట్టుమిట్టాడుతున్నామని గిరిజనులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు మాకు కట్టించిన కాలనీలలో స్లాబులు కురుస్తున్నాయని, అలాగే మా కాలనీలకు సిసి రోడ్లు కానీ, డ్రైనేజీల సౌకర్యం గాని, ప్రభుత్వం కల్పించకపోవడం చాలా విడ్డూరంగా ఉందని, కురుస్తున్న ఈ వర్షాలకు ఇంట్లో నుంచి బయటకు వస్తేచాలు ఎక్కడ చూసినా బురద గోతులు దర్శన మిస్తున్నాయని, కట్టిన బాత్రూంలు కూడా అంతంత మాత్రంగానే నాణ్యత లోపంగా భవనాలను నిర్మించారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరు అక్కడికి వెళ్తే అన్ని వసతులు కల్పిస్తామని చెప్పిన అధికారులు ఇక్కడకు వచ్చిన తరువాత మమ్మల్ని పట్టించుకోవటం లేదని వారు వాపోతున్నారు. పంచాయతీ భవనం లేదు, పోస్ట్ ఆఫీస్ లేదు, వైద్యశాల లేదు, దురదృష్టవశాస్తూ ఎవరైనా పోతే దహన సంస్కారాలకు స్మశాన వాటికను కూడా నిర్మించలేదనీ, తదితర సౌకర్యాల లేమితో ఇక్కడ నానా అవస్థలు పడుతున్నామని దిగులు చెడుతున్నారు. ఇక్కడ అంగన్వాడీ భవనము, కమ్యూనిటీ హాల్ కట్టారు కానీ దాన్ని ఇంత వరకు ప్రారంభించలేదనీ వారు చెబుతున్నారు. వి.ఆర్.పురం మండలంలో ఉంటే ప్రతి ఏటా గోదావరి వరదలను తట్టుకోలేక మేము ఇక్కడికి వస్తే ఇక్కడ సౌకర్యాలు లేమితో చాలా ఇబ్బందులు పడుతున్నామని, వారు ఆరోపిస్తున్నారు. మేము విఆర్ పురం మండలం నుంచి వచ్చి సంవత్సరం అవుతుందని, మేము వచ్చిన దగ్గర్నుంచి మమ్మల్ని ఇంతవరకు ఏలూరు జిల్లాలోకి యాడ్ చేయలేదని, ఇప్పటికీ మేము సంవత్సర కాలంగా మా రేషన్ ని, పెన్షన్లను, వీఆర్పురం మండలానికి వచ్చి ప్రతి నెల తీసుకోవలసి వస్తుందని, ఈ నెల పెన్షన్లను వి ఆర్ పురం మండలం అధికారులతో మాట్లాడి పెన్షన్లు అందించే సచివాలయ సిబ్బందినీ మేము ఉన్నచోటకె పిలిపించుకొని, 35 మంది లబ్ధిదారులు పింక్షలను తీసుకున్నారని, ప్రతినెల ఇటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చూడాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఈ ఆర్ అండ్ ఆర్ కాలనీలలో డ్రైనేజీలు, రోడ్లు, ప్రభుత్వ భవనాలు తదితర మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్లే అక్కడ నుంచి ఇక్కడకు మా వాళ్ళు ఎవరు రాలేకపోతున్నారని, అలా అని అక్కడ నివసిస్తున్న వాళ్ళు ప్రతి ఏటా వచ్చే వరదలకు నానా అవస్థలు పడుతున్నారని వారు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం స్పందించి మాకు ఇచ్చిన ఈ ఆర్ అండ్ ఆర్ కాలనీలో అన్ని వసతులు కల్పించాలని విఆర్ పురం మండలంలో వరదల్లో మగ్గుతున్న మా తోటి గిరిజనులను కూడా ఇక్కడ రప్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో గొల్ల రత్నకుమార్ రెడ్డి, పొగల హరీష్ రెడ్డి, వెట్ల రాంకుమార్ రెడ్డి, వేట్ల శివకుమార్ రెడ్డి, పోగాల మహేశ్రెడ్డి, పోగల మంగిరెడ్డి, వైట్ల ముత్యాల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article