మార్కాపురం
పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కె.పి మాట్లాడుతూ.గత నాలుగున్నర సంవత్సరాల తన పదవీకాలంలో ఆర్యవైశ్యులకు తగిన ప్రాధాన్యత ఇచ్చానని మార్కాపురం శాసనసభ్యుడు నాగార్జున రెడ్డి అన్నారు. మంగళవారం మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పానుగంటి మురళి, డైరెక్టర్లు ఊటుకూరు సురేష్, చక్క సత్యనారాయణ లకు అవకాశం కల్పించిన సందర్భంగా ఆర్యవైశ్య ప్రముఖులు ఆయనను కలసి ఆయన స్వగృహంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి మాట్లాడుతూ ఆర్యవైశ్యులకు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం చైర్మన్గా అవకాశం కల్పించామన్నారు. దేవస్థానంలో నాలుగు గోపు రాలా నిర్మాణానికి భక్తుల సహకారంతో 12. 5 కోట్ల రూపాయలు విరాళాలు వచ్చాయని అందులో సుమారు ఏడు కోట్ల రూపాయలు ఆర్య వైశ్యులు వివారాలుగా అందజేశారన్నారు. మున్సిపల్ చైర్మన్ గా ఆర్యవైశ్యులకు అవకాశం కల్పించా.అని, అలాగే గత మూడుసార్లుగా మార్కెట్ యార్డు నందు ఆర్యవైశ్యులకు తగిన ప్రాధాన్యత కల్పించామన్నారు. వెలిగొండ ప్రాజెక్టు రెండు టన్నెల్స్ పూర్తి అయ్యాయని, వచ్చే సీజన్ నాటికి ఈ ప్రాంతానికి వెలిగొండ జలాలు వస్తాయన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మార్కాపురం పట్టణానికి మెడికల్ కాలేజ్ మంజూరు చేయడం పట్టణ అభివృద్ధికి నిదర్శనం అన్నారు. వచ్చే ఏడాదికి మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తయి తరగతులు జరుగుతాయని, ఫలితంగా వచ్చే పదేళ్లలో మార్కాపురం పట్టణం మెడికల్ హబ్ గా రూపొందుతుందని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలలో ఆర్య వైశ్యులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలపాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బాల మురళీకృష్ణ, మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ శేషగిరిరావు, ఆర్యవైశ్య నాయకులు మున్సిపల్ కౌన్సిలర్ కొత్త కృష్ణ, రామడుగు శ్రీనివాసులు, జవ్వాజి గున్నాధం, బచ్చు జనార్ధన్, వూటు కూరి రామకృష్ణ, పెరుమాళ్ళ సురేష్, వాసవి క్లబ్ నాయకుడు వెంకటేశ్వర్లు, పోలేపల్లి లక్ష్మీనారాయణ, ఎక్కలి శేషగిరి రావు, సోమిశెట్టి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

