ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మించిన ‘వ్యూహం’ సినిమాకు మరోసారి హైకోర్టు బ్రేక్ వేసింది. సెన్సార్ బోర్డు గతంలో ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ ను క్వాష్ చేసింది. మూడు వారాల్లో మరోసారి సినిమాను పరిశీలించి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డును ఆదేశించింది. మరోవైపు, ఎగ్జామింగ్ కమిటీ ఇచ్చిన సవరణలను రివ్యూ కమిటీ పట్టించుకోకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి రెండు కమిటీలు సినిమా చూసి తమకు నివేదిక అందజేయాలని ఆదేశించింది.