వి.ఆర్.పురం
మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల ఆగోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన ఆరోగ్యా సురక్ష పథకం ద్వారా, అందరికీ ఆరోగ్యాన్ని అందిస్తున్నారని వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మాదిరెడ్డి సత్తిబాబు, జే సి ఎస్ మండల బొడ్డు సత్యనారాయణ అన్నారు. మండలంలొని రాజుపేట గ్రామ సచివలయం వద్ద 2వ విడత ఆరోగ్య సురక్ష కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు రోగులను పరీక్షించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మాదిరెడ్డి సత్తిబాబు, జే సి ఎస్ మండల ఇంఛార్జ్ బొడ్డు సత్యనారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వర్యులు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని, ఈ క్యాంపు నందు ప్రజలకు ఉచిత వైద్య చికిత్సలు చేసి ఖరీదైన మందులు ఇస్తారని, అవసరమైన వారిని మెరుగైనా వైద్యం నిమ్మిత్తమ్ ప్రభుత్వం వారి సహకారంతో కార్పొరేట్ హాస్పిటల్స్ లో వైద్యం అందేలా చూస్తారని వారన్నారు. అలాగే ఈ క్యాంప్ లో జనరల్ సర్జన్ డా మహేష్, గైనకలాజిస్ట్ డాక్టర్ స్వాతి, కంటి వైద్య నిపుణులు పార్వతీ, జీడిగుప్ప డాక్టర్ లు సూర్యప్రకాష్, రోజా రమణి పాల్గొన్నారని, ప్రజలంతా ఈ క్యాంపు ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ డివిజన్ కమిషన్ సభ్యులు చిక్కాల బాలకృష్ణ, సర్పంచ్ వడ్డనపు శారదా, ఉప సర్పంచ్ ముంజూపు రాము, సచివాలయ కార్యదర్శి, రేఖపల్లి హాస్పిటల్ సిబ్బంది సచివాలయ సిబ్బంది వెలిఫెర్ అసిస్టెంట్ సోడి రాము, హరీష్ తదితరులు పాల్గొన్నారు.