*జగనన్నా… ఏమిటన్నా ఇది..?
*మీ జమానాలో లో జైలు కెళ్ళేది ఎంత మంది..
*ఐఏఎస్ లెందరున్నారు…అయ్యా ఎస్ లెందరున్నారు…!
*ఈ జైళ్ళ కథ జగన్ మీద కోపంతోనేనా..
*నిజంగా ఇన్ని తప్పులు చేసారా…
*అధికారం ఉందని అడ్డదారులు త్రొక్కరా..
*ఐదేళ్ల పాలనలో అంతా అవినీతి మయమేనా…
*రాజకీయాలంటే ఇంత నీచమా…!
*మంత్రులంటే ఇన్నిముష్ఠి పనులు చేస్తారా…
*వీరేనా ప్రజాస్వామ్య పరిరక్షకులు…
*ఈ జైలు కథలకు ముగింపు పడేదెన్నడో…
(రామమోహన్ రెడ్డి)
ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత రాజకీయ , అధికార వ్యవస్థ లతో విసిగి వేసారి పోయిన ప్రజలు ఒకనాటి ఆంగ్లేయుల పాలనను గుర్తు చేసుకుంటారని ఆనాడే చక్రవర్తి రాజగోపాలాచారి చెప్పిన విదంగా నేడు ఆంద్ర రాష్ట్ర ప్రజలు కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాజకీయాలు అంటే బ్రష్టుపట్టి పోయాయా అన్న ఆలోచన కు వస్తుంటే ఆంద్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్ ఎంత అంధకారంలో ఉందొ అర్ధమవుతుంది. ప్రజా సేవ పేరుతో ప్రజల ఆస్తులు ఇలా దోపిడీ చేస్తున్న నేతల చూస్తే వీరేనా ఈ ప్రజల తలరాతలను మార్చేది అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.గత ప్రభుత్వం లో నిజంగా ఇంత భారీ స్థాయిలో అవినీతి అక్రమాలు జరిగాయా లేదా అన్నది ప్రక్కన పెడితే ఏ రోజు ఏ నేత జైలు కెళ్తారో తెలియని అయోమయ స్థితిలో నవ్యాంధ్ర ప్రదేశ్ నేతల్లో అలజడి పుట్టడం చూస్తే అవాక్కువతున్నారు నవ్యాంధ్రులు.
ఈ రోజు నవ్యాంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అరెస్టుల పర్వం ఎంతో సిగ్గుచేటని చెప్పాలి.ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విదంగా నవ్యాంధ్రప్రదేశ్ లో దేశానికి తలమానికంగా ఉన్న ఐఏఎస్ లు అయ్యా ఎస్ అనే వారు కూడా అరెస్ట్ కాబడి జైళ్లలో మగ్గుతుంటే ఇంత అన్యాయపు పాలన అందించారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ అధికారం చేపట్టి తరువాత జరిగిన పరిణామాల నేపధ్యంలో వైఎస్ జగన్ ప్రభావంతో జైలు గేట్లు తెరవడం మొదలు కాగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కూడా జైలు గేట్లు అనేక మంది ఐఏఎస్ ఐపిఎస్ లతో పాటు శాసనసభ లో చట్టాలు చేసే వారు కూడా సంకెళ్లు వేసుకున్న దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడిందంటే ఎంత దిక్కుమాలిన ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు బ్రతుకుతున్నారో ఉహిస్తేనే ఇదేనా మన ప్రజాస్వామ్యం అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
రాష్ట్ర విభజన తరువాత ఈ రాష్ర్టానికి రాజధాని ఏది అన్న చిరునామా కూడా లేదని ఆలోచన చేయక పోయిన ఒకరు అమరావతి ముద్దు అంటే ఒకరు వద్దు అన్నారు.ఒకరు మద్యం వద్దు అంటే ఇంకొకరు మద్యం ముద్దు అన్నారు.ఇలా ఒక ప్రభుత్వం చేసిన పథకాలుతరువాత ప్రభుత్వం కోన సాగింపు చేస్తూ సవరణలు చేయటం ప్రజాస్వామ్యములో పరిపాటిగా వస్తుంది.కానీ రాష్ట్ర విభజన తరువాత వ్యక్తిగత దూషణలు, వ్యక్తి పూజా, తమ హావభావాల కోసం పగ ప్రతీకారం కోసమే ప్రభుత్వాలు పనిచేస్తున్నాయనే సంకేతాలు ఇవ్వడంతోనే నేడు ఈ రాష్ట్రం ఇలా తగలబడి పోతుందని చెప్పక తప్పడం లేదు.
ఒక పార్టీ అధికారం లో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలలో విధాన పరమైన మార్పులు ఉంటే సవరించి ప్రజలకు మేలు చేకూరే కార్యక్రమాలు చేసి ప్రజాప్రయోజనాలు కాపాడాల్సిన నేతలు ప్రజల ఆశలు ,పార్టీ పై పెట్టుకున్న నమ్మకాన్ని నమ్మి అప్పగించిన అధికారాన్ని తమ ఆధిపత్యం కోసం ఉపయోగించుకుని అది జరిగింది ఇది జరిగిందని అరెస్ట్ ల పర్వం మొదలుపెట్టారు.అధియును కాక ఐదు కోట్ల ప్రజల అసలకు అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణకు అడుగులు వేయాల్సిన అసెంబ్లీని సైతం అబద్ధాల అడ్డగోలు మాటలకు నిలయంగా మార్చిన ఘనత ఈ నవ్యాంధ్రప్రదేశ్ నేతలకే దక్కిందని చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో నవ్యాంధ్ర రాజకీయాలు నేటి ప్రజానీకానికి కొంత అసహ్యం పుట్టించే లా ఉన్నాయనే అపవాదు మూటగట్టుకోక తప్పడం లేదు.