ఆదివాసి గిరిజన సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ
జీలుగుమిల్లి
జీలుగుమిల్లి మండలం వంక వారి గూడెంలో నిర్మిస్తున్న అదాని ఆయుధ కర్మగారం భూసేకరణ వెంటనే నిలుపుదల చేయాలని
రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర ఒక ప్రకటనలో కోరారు.
ఆయుధ కర్మగారం నిర్మించవద్దని జరిగిన గ్రామసభ తీర్మాణము ప్రకారం ఆయుధ కర్మగార నిర్మాణం వెంటనే ఆపాలి
ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం వంక వారి గూడెంలో స్థానిక తాహసిల్దర్ ఆధ్యర్యంలో జరిగిన గ్రామసభలో గ్రామస్తులందరూ ఆయుధ కర్మగారం నిర్మించవద్దని ఏకగ్రీవంగా తీర్మానించారు. గ్రామ సభ తీర్మానం ప్రకారంగా ఆయుధ కర్మ గారం నిర్మాణ భూసేకరణ వెంటనే రద్దు చేయాలని ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది
కేంద్ర ప్రభుత్వం వంక వారి గూడెంలో 1166 ఎకరాలలో ఆయుధ కర్మ గారం నిర్మించుటకు భూసేకరణను రమణక్కపేట, దాట్ల వారి గూడెం, కొత్త సీమల వారి గూడెం మరియు వంక వారి గూడెం గ్రామాలకు చెందిన ఆదివాసుల భూములను సేకరణకు స్థానిక తాహశిల్దార్ సమక్షంలో జరిగిన గ్రామసభలో ఆయ గ్రామ ప్రజలు భూ సేకరణ చేయవద్దని ఏకగ్రీవంగా తీర్మానించారు. గ్రామ సభ తీర్మానం ప్రకారంగా ఆయుధ కర్మగార నిర్మాణం వెంటనే ఆపాలని మరియు భూ సేకరణ తక్షణమే నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది
ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో ఏ ప్రోజెక్ట్ నిర్మాణము కైన భు సేకరణ చెయ్యాలంటే గ్రామసభ ఆమోదం తప్పని సరి 5వ షెడ్యూల్ ప్రాంతంలో గ్రామసభలకు విస్తృతమైన అధికారాలు ఉన్నాయి. గ్రామసభలో ఆయుధ కర్మ గార బాధిత ఆదివాసులు బుసేకరణ చేయ్యావద్దని ఆయుధ కర్మ గారం నిర్మించ వద్దని తీర్మానం ప్రకారం తక్షణమే భూ సేకరణ ఆపి ఆయుధ కర్మగార నిర్మాణ ఒప్పందం నిలుపుదల చేయకపోతే ఆదివాసుల ఆగ్రహాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సవి చూడవలసి వస్తుందని ఆదివాసి గిరిజన సంఘం హెచ్చరిక చేస్తుందని చెప్పారు