కామవరపుకోట
రైతన్నల శ్రేయస్సే లక్ష్యంగా గోద్రెజ్ సంస్థ పనిచేస్తుందని సంస్థ డీజీఎం మురళిదర్ అన్నారు . కామవరపుకోట మండలం సాగిపాడు గ్రామంలో ఆయిల్ ఫామ్ తోటలో పని చేస్తూ కొన్ని నెలల క్రితం విద్యుత్ ప్రమాదానికి గురై కుడి కాలు కోల్పోయిన బాధితుడు దత్తాడి చందు కుటుంబాన్ని గోద్రెజ్ ఆగ్రో లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు గురువారం పరామర్శించి సంస్థ తరఫున రెండు లక్షల 50 వేల రూపాయలు చెక్కును ఆ కుటుంబానికి అందజేశారు. అలాగే చికిత్స సమయంలో వైద్య ఖర్చు నిమిత్తం 1,50,000 కూడా అందజేసినట్టు తెలిపారు. బాధితుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారని అలాగే ఆ కుటుంబానికి అండగా నిలుస్తామని తెలియజేశారు . బాధితుని కుమారుడికి సంస్థలు ఉద్యోగం కల్పించినట్లు చెప్పారు.ఈ సందర్భంగా సంస్థ డీజీఎం మురళి మాట్లాడుతూ ఆయిల్ పామ్ రైతులు మరియు కూలీలు కొరకు సంస్థ ద్వారా ఉచితంగా 5 లక్షల రూపాయలబీమా సౌకర్యం కల్పిస్తున్నామని దీనిని తప్పనిసరిగా ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని తమ ఏరియా ప్రతినిధులకు తెలియజేసి ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని అన్నారు . అలాగే సంస్థ తరఫున ఆయిల్ రైతులకు కూలీలకు భద్రతా ప్రమాణాలపై అవగాహన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని, అలాగే తోటలో గెలలు దిగుమతి చేసే క్రమంలో విధిగా కాళ్లకు బూట్లు చేతికి గ్లౌజులు తప్పనిసరిగా ధరించాలని ప్రమాదాల నివారణకు తమ వంతుగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని రైతు ఆర్థిక అభివృద్ధి శ్రేయసే లక్ష్యంగా గోద్రెజ్ ఆగ్రోవేట్ లిమిటెడ్ సంస్థ పనిచేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా మేనేజర్ ఎం వి భాస్కరరావు, స్థానిక రైతులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.