Tuesday, September 16, 2025

Creating liberating content

తాజా వార్తలుఆయిల్ దుకాణాలపై ఆహార భద్రత శాఖ తనిఖీలు

ఆయిల్ దుకాణాలపై ఆహార భద్రత శాఖ తనిఖీలు

హిందూపురం టౌన్ :పట్టణంలో జరుగుతున్న కల్తీ వంట నూనెలపై కల్తీ నూనెలతో పొంచి ఉన్న ప్రమాదం అనే శీర్షిక ప్రత్యేకంగా ప్రచురితం కావడం విదితమే. ఈ నేపథ్యంలో సోమవారం ఆహార భద్రత అధికారిణి తస్లీం పట్టణంలో శ్రీ ట్రేడర్స్ అయిల్ డిపోపై ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విడి నూనెను శాంపిల్ తీసి, దు కాణంలో అపరిశుభ్రత ఎక్కువ ఉండడంతో నోటీసు ఇచ్చారు. ఈ విషయం తెలియడంతో మిగిలిన దుకాణాదారులు వారి షాపులను మూసి వేశారు. దీంతో లేపాక్షి అయిల్ దుకాణాన్ని తనిఖీ చేసి, కబాబ్ పౌడర్ ను శాంపిల్ తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ,కల్తీ ఆహార పదార్థాలను ఎవరు అమ్మినా వారిపై కేసులను నమోదు చేస్తామని ఆమె తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article