సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా ఆప్కాస్ స్టేట్ బోర్డ్ డైరెక్టర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి
పోరుమామిళ్ల:
పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఆప్కాస్ ఉద్యోగస్తులకు ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి చేతుల మీదుగా హెల్త్ కార్డులు పంపిణీ చేశారు. సోమవారం ఎమ్మెల్సీ డిసి గోవింద్ రెడ్డి స్వగృహంలో ఆప్కాస్ స్టేట్ బోర్డ్ డైరెక్టర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వా ఆసుపత్రిలో పనిచేస్తున్న ఆప్కాస్ ఉద్యోగస్తులకు హెల్త్ కార్డులు ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి మాట్లాడుతూ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో హాస్పిటల్స్ సిబ్బందికి హెల్త్ కార్డులు అందజేయడం సంతోషమని ఈ హెల్త్ కార్డు ప్రతి ఒక్కరు సద్విని పరుచుకోవాలని ఆయన కోరారు. అలాగే డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ ఎటువంటి సమస్య అయినా నా దృష్టికి తీసుకొస్తే ఎమ్మెల్సీ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో సమస్యను పరిష్కరించేందుకు నా వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపర్నెంట్ డాక్టర్ నాగేంద్ర, రాళ్లపల్లి నరసింహులు, ఆరోగ్యశ్రీ శ్రీనివాసులు, ల్యాబ్ సుధాకర్, ప్రసాద్, మద్దిలేటి ఆప్కాస్ ఉద్యోగస్తులు పాల్గొన్నారు.

