- వడ్డెర్లకు 30 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత టిడిపిదే
ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ
హిందూపురం
భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో వడ్డెర ఓబన్న ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారని, ఆయన ఆదర్శప్రాయుడని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కొనియాడారు. స్థానిక శ్రీకంఠాపురం కూడలిలో ఏర్పాటు చేసిన వడ్డెర ఓబన్న విగ్రహానికి బాలకృష్ణ శుక్రవారం పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేత కొల్లకుంట అంజనప్ప, వడ్డే నవీన్ తదితర ఆ సంఘం నేతలు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతo పలికారు. క్రేన్ తో భారీ గజమాల వేసి బాలయ్యకు స్వాగతం పలికారు. అనంతరం జరిగిన బహిరంగ సమావేశంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, స్వాతంత్ర్య పోరాటంలో వడ్డెర ఓబన్న ఎన్నో ఉద్యమాలు చేపట్టి పేరు, ప్రఖ్యాతులు సాధించారని కొనియాడారు. అలాంటి మహానేత విగ్రహాన్ని ఆ సంఘం ప్రతినిధులు ఏర్పాటు చేయడం హర్షణీయమని కొనియాడారు. వడ్డెర్లకు 30% రిజర్వేషన్లు కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని హర్షద్వానాల నడుమ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వడ్డెర్లు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు శ్రీదేవి, కౌన్సిలర్ మంజుళ తదితరులు పాల్గొన్నారు.