నేను మగాణ్ణి..
ఈ ఇగోను వదిలి
చాలా దూరం వచ్చినా
ఇప్పటికీ వదలని
పురుషాహంకారం..
ఆడదంటే వెటకారం..!
సరే…
ఎన్ని లోపాలున్నా హీరో..
ఇంట్లో ఆడది
ఎన్ని బాధలు
పడుతున్నా
పట్టించుకోని నీరో..!
రోజులు మారాయనే
సత్యాన్ని గ్రహించని రాజు..
తాను మగాన్నని పెద్ద పోజు..
ఆడదీ సంపాదిస్తున్నా
తన కంటే ఎక్కువే తెస్తున్నా
పెళ్లికి తప్పని కట్నం..
ఆపై భారీ లాంఛనాలు..
తనపై తనకే
పెద్ద అంచనాలు..
పెద్దమనిషిగా
కటింగులు కొడుతూ
వంచనలు..
ఇంట్లో ప్రతి చిన్న విషయానికి
పంచనామాలు..
మగాన్ని ఆంటూ
ఇంటి పనులకి ఎగనామాలు..!
ఇదంతా నాణేనికి ఒక వైపు
కాని యుగాలుగా
కుటుంబాన్ని నడిపిస్తున్న
యజమాని..
తానే రాజుగా..
తానే బంటుగా..
భారం మోస్తూ..
దెబ్బలు కాస్తూ..
బాధలను మౌనంగా
భరిస్తూ..
కథని నడిపిన నాయకుడు..
అప్పుడప్పుడూ
ప్రతి నాయకుడు..,!
అన్నట్టు..
ఇప్పుడిప్పుడే మార్పు..
ఇంటి పనుల్లోనూ
ఓ చెయ్యి..
భార్యకు ఆసరా..
పిల్లలకు నీళ్ళు పోసి..
ముస్తాబు చేసి..
బడికి దింపి..
క్యారేజీ ఇచ్చి..
సరకులు తెచ్చి..
ఆనక పనికి పోయే
సగటు జీవి..
బయట బోసు..
ఇంట్లో దాసు..
పెళ్ళామే బాసు..!
మొత్తంగా మగాడంటే..
పేరుకే నేను..
ఇంట్లో నో(no)ను..
బయట న్యూ(new)ను..!
సురేష్..9949546286