కుమారుని జ్ఞాపకార్థం భవిత కేంద్రంలో విద్యార్థులకు
ఏలేశ్వరం:-ప్రముఖ శీతలపానీల డిస్ట్రిబ్యూటర్ సామంతుల భాస్కరరావు కుమారుడు సాత్విక్ జ్ఞాపకార్థం స్థానిక భవిత మనోవికాస కేంద్రంలో విద్యార్థులకు ఆట వస్తువులు, ఫ్రూటీలు, బిస్కెట్లు అందచేశారు. ఈ సందర్భంగా భాస్కరరావు దంపతులు మాట్లాడుతూ తమ కుమారుడు తమకు దూరమైన ప్రతి విద్యార్థిలోని తమ కుమారుడిని చూసుకున్నామన్నారు. విశ్వహిందూ పరిషత్ మాతృ శక్తి ప్రధాన కార్యదర్శి కొప్పుల ఇందిరా జన్మదినం సందర్భంగా , సూర్యకుమారి, కటకం కిరీటి ధన సహాయంతో అల్లుకలు కుట్లు కు వైర్లు , ధారాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో భవిత కేంద్రం ఉపాధ్యాయులు చింతా పద్మజ, పి. బుజ్జి , కోరాడ రాజు, నీలం శ్రీనివాస్, ఉడతల రమణారావు తదితరులు పాల్గొన్నారు.