*చింతలపూడి నియోజకవర్గంలో అక్రమ రవాణా అడ్డుకట్ట వేయలేరా…
రేషన్ బియ్యం డాన్ రామచంద్రుడి దళారుడి అంటే హడలేనా?
టచ్ చేస్తే టార్చర్ తప్పదా?
పట్టుపడేది క్వింటాల్లో – తరలిపోయేది టన్నుల్లో
ఎమ్మెల్యే సొంగరోషన్ ఆదేశాలు కూడా లెక్కలేవా? (మత్తే బాబీ ప్రజాభూమి స్పెషల్ కరెస్పాండెంట్, ఏలూరు నుంచి) నేరం ఒక్కటే కాకపోతే నేర స్వభావం మారిందన్న చందంగా ప్రభుత్వ లక్ష్యం మేరకు ఎండియూ వాహనాలు తొలగించి డీలర్లకు పిడీఎస్ రైస్ అప్పగించింది.అంతే తప్ప అక్రమ రవాణా అన్నది అనాటి ప్రబుత్వం కంటే కూటమి ప్రభుత్వం లోనే పేదల కడుపు కొట్టి రేషన్ స్మగ్లర్లు కొల్లగొడుతున్న తీరు మాత్రం ఏమాత్రమూ మారలేదని చెప్పడానికి సిగ్గుచేటు గా ఉంది.మంత్రి మనోహర్ మాటలు మనోహరంగా ఉన్నాయనే విమర్శలు వచ్చిపడుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఓ మంత్రి అండదండలతో రేషన్ బియ్యాన్ని అడ్డగోలుగా తరలించి అడ్డు అదుపూ లేకుండా బరితెగించిన బడా స్మగ్లర్ రేషన్ డాన్ రామచంద్రుడు చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కాకపోయిన అదే తీరు కూటమి ఎమ్మెల్యే లు ఓ మంత్రి ముడుపుల మాయలో పడి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయాన్ని కూడా మరిచి పిడీఎస్ డాన్ కే దాసోహం అంటున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ముఖ్యంగా ఏలూరు జిల్లా, చింతలపూడి నియోజకవర్గం పరిధిలో లింగపాలెం కేంద్రంగా పాగా వేసిన పిడిఎస్ డాన్ రామచంద్రుడి ప్రధాన దళారీ దయలేని దత్తు తరలిస్తున్న అక్రమ రేషన్ బియ్యం రవాణాపై ఎన్ని కథనాలు వెలువడిన కూడా అడ్డుకట్టవేయడానికి చర్యలు మాత్రం శూన్యమనే చెప్పాలి. నియోజకవర్గంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా చాప కింద నీరులా విస్తరించిందనే ఆరోపణలు ఉన్నాయి.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వందల కోట్ల వ్యయంతో ఎన్నో ఆశయాలతో పంపిణీ చేస్తున్న ఈ బియ్యం అక్రమార్క దళారులు, రేషన్ బియ్యం డాన్ రామచంద్రుడు,ప్రధాన దళారీ దయలేని దత్తు జేబులు నింపుతున్నాయనేది అక్షర సత్యం. అడ్డుకట్ట ఎలా? చర్యలు ఏవి?……. పేదవారికి చెందవలిసిన రేషన్ బియ్యం కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ 5 కిలోలు చొప్పున అందిస్తుంది, పేద ప్రజల ఆకలి తీర్చాలనే ఉద్దేశ్యంతో తెల్ల రేషన్ కార్డుల దారులకు ప్రతి నెల బియ్యం, పంచదార, ఇతర నిత్యావసరాలు అందిస్తుంది. అంతా బాగానే ఉన్న ఈ రేషన్ బియ్యం వెనుక ఓ భారీ మాఫియా విస్తరించింది… ఆ మాఫియా డానే మన రామచంద్రుడు, ప్రధాన సూత్రధారి దళారీ దయలేని దత్తు. ఈ రేషన్ బియ్యం కడు పేదరికంలో ఉన్నవారు మాత్రమే తింటున్నారు, కొంచెం ఆర్ధిక స్థోమత ఉన్నవారు మధ్యతరగతి వారు ఎక్కడ సరఫరా చేస్తున్నారో అక్కడే అమ్మకాలు చేస్తున్నారు.ఇక అక్కడ నుండి ఈ బియ్యం అక్రమ రవాణా మొదలవుతుంది,దీనికి అడ్డుకట్ట వెయ్యాల్సిన వీఆర్వోలు,సి.యస్.డి.టి తాసీల్దార్లు తగిన చర్యలు తీసుకోవడం లేదన్నా ఆరోపణలు ఉన్నాయి. టచ్ చేస్తే టార్చారేనా?…. ఈ రేషన్ బియ్యం డాన్ గా పేరొందిన రామచంద్రుడిపై ఇప్పుడు వరకు ఎన్ని కేసులు ఉన్నాయి? ఎంతమంది విలేకరులను బెదిరించాడు, ఎదురు వెళ్తే అంతే సంగతులు అనే విధంగా,టచ్ చేయాలంటే టార్చర్ చూపించే తీరుగా ఇతగాడి లీలలు ఉంటాయంటున్నారు బాధిత సబ్యులు.ఆవు చేలో మేస్తే దూడ గట్టు మీద మేస్తదా అనే చందంగా *ప్రధాన దళారీ దయలేని దత్తు తీరు ఉందనే ప్రచారం జరుగుతోంది. అందుకేనేమో ప్రభుత్వ అధికారులు సైతం మిన్నకుండిపోతారనే వాదన కూడా ఉంది. పట్టుబడేది క్వింటాలు – తరలిపోయేది టన్నుల్లో… సేకరించిన రేషన్ బియ్యం ఒక పక్క ప్రణాళిక ఒక డంపు చేసి వాటిని చిన్న వాహనాలు బడా దోస్తు,టాటా ఇంట్రాల ద్వారా పెద్ద వాహనాలలోకి తరలించి అక్కడ నుండి జాతీయ రహదారి మీదుగా కాకినాడ పోర్టుకు తరలిస్తారు, ఈ క్రమంలో ఎప్పుడు కూడా చిన్న వాహనాలలో దొరికేది క్వింటాలే. తరలిపోయేది మాత్రం టన్నుల్లో…తరలిపోయిన సరుకు ఇటీవల కాలంలో కాకినాడ పోర్టులో కంటైనర్లో విదేశాలకు తరలిస్తుండగా ఉప ముఖ్యమంత్రి సీజ్ ది షిప్ అన్నారు.ఆలా అన్నారే తప్ప అవి ఆచరణలో కి వచ్చిన దాఖలాలు ఏ మాత్రం కనిపించడం లేదన్న అపవాదు ఉపముఖ్యమంత్రి మూట గట్టుకుంటున్నారు. అలా అనడం ఆ ఆదేశాలతో బియ్యం అక్రమ రవాణా రాష్ట్రం అంతా తేట తెల్లమయినది, వేల కోట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సొమ్ము,టన్నుల కొద్ది రేషన్ బియ్యం రూపంలో పక్కదారి పడుతుందనేది వాస్తవంగా నిలుస్తోంది. ఎమ్మెల్యే ఆదేశాలకు విలువేది?ఆయన మాటంటే లెక్కలేదా?…. స్థానిక చింతలపూడి శాసనసభ్యులు ఈ అంశంపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారిచేసినట్లు తెలుస్తోంది, నియోజకవర్గ స్థాయిలో తప్పు చేసే అక్రమార్కుల పట్ల కఠినంగా వ్యవహారించాలని తెలిపినట్లు తెలుస్తోంది.. అధికారులు ఏ మాత్రం చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి… “రేషన్ డాన్ రామచంద్రుడు”,ప్రధాన అక్రమ “దళారుడు దయలేని దత్తు”రేషన్ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తారోలేదో?మరి.