రోగులకు మెరుగైన వైద్యాన్ని అందించాలి
ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తాం
శాసనమండలి సభ్యులు రాంగోపాల్ రెడ్డి
పులివెందుల :ఆంధ్ర ప్రదేశ్ ను ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్ద డమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని శాసనమండలి సభ్యులు భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి పేర్కొన్నారు సోమవారం ఆయన మెడికల్ కళాశాలను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ కళాశాలలో ఓపి విభాగం, రోగులకు అందిస్తున్న వైద్య సదుపాయాలపై మెడికల్ కాలేజీ సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా వైద్యులు,రోగులు, ఔట్సోర్సింగ్ సిబ్బంది ఆయనకు సమస్యలను వివరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యాంధ్రప్రదేశ్ను సాకారం చేయ డంలో ఎన్టీయే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో ఈ కలను సాకారం చేస్తాం అన్నారు. రోగులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని ఆయ న వైద్యులను కోరారు. ఈ సందర్భంగా వైద్యులు కళాశాలలో సిబ్బంది కొరత, వసతులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు కళాశాలలో అన్ని వసతులు కల్పించేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు అలాగే ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తమకు జీతాలు సరిగా రావడం లేదని, అరకొర జీతాలు పులివెందుల నుంచి కళాశాలకు రావాలంటే ఆటో చార్జీలకే సగం అయిపోతుందని తమకు బస్సు సౌకర్యం కల్పించాలని తదితర సమస్యలను ఆయ న దృష్టికి తీసుకెళ్లారు త్వరలోనే అన్ని సమస్యల ను పరిష్కరిస్తామని ఉద్యోగులకు ఆయన హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ సూపర్డెంట్ డాక్టర్ కేవీ విగ్నేశ్వర రావు , ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీదేవి , డాక్టర్ వినయ్,డాక్టర్ రమణయ్య , వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ మహేష్ , డాక్టర్ వరలక్ష్మి తెలుగు దేశం నాయకులు మైసూరారెడ్డి,పటాల బాబు,గంగిరెడ్డి,శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
