*నా 16 నెలల ఉద్యోగం ఎంతో అనుభూతినిచ్చింది..
*మొదట ఎందుకొచ్చానా అనుకొన్న …
*నాడు నా బదిలీ పై కొంత ఆలోచన పడ్డా
*స్ తరువాత దేవుడిఆదేశానుసారం అనుకొన్న..
*కానీ ఇక్కడి ప్రజలను చూశాక నేనెంతో సంతోషించా..
*కరువు బీడు భూముల్ని చూసా…
*ఉద్యోగం అంటే బాధ్యత..
*ప్రజలకు సంతృప్తి ఇచ్చి నప్పుడే సార్ధకత …
*ఎన్నో రాష్ట్రాలు చూసా..నాకు ఏపీ ప్రత్యేకం..
*సొంత ఇల్లు ఢిల్లీకి వెళ్తున్నా కూడా సంతోషంగా ఉన్నా..
*ఇక్కడి వాతావరణం మరెక్కడ రాదు..
*డిల్లీ లో ఉన్నా అందరికి అందుబాటులో ఉంటా..
పిఐబీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ రాజేందర్ చౌదరి
విజయవాడ,జూన్ 23:
ఉద్యోగం అనేది ఏ ప్రాంతంలో చేసినా ఆ ప్రాంత ప్రజల మనస్సుల్లో స్థానం సంపాదించుకోవడం ఎంతో ముఖ్యమని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆడిషనల్ డైరెక్టర్ జనరల్ రాజేందర్ చౌదరి అన్నారు.సోమవారం సాయంత్రం విజయవాడ పిఐబీ సమావేశ మందిరంలో బదిలీపై ఢిల్లీ వెళ్తున్న ఎడిజి రాజేందర్ చౌదరి కి ఆత్మీయత వీడ్కోలు సభను ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తర రాష్ట్రాల లో చాలా సంవత్సరాల పాటు పనిచేశానని కేవలం దక్షిణాది లో బెంగుళూరు,హైదరాబాద్ కేరళ కు కేవలం కొన్ని కార్యక్రమలకు హాజరు అయ్యి వెళ్ళేవాడని కానీ విజయవాడకు బదిలీ చేసినప్పుడు కొంత అసహనం గా ఫీల్ అయ్యినా భగవంతుడి ఆదేశానుసారం అనుకుని వచ్చానని అన్నారు.కానీ ఇక్కడి ప్రాంతంలోని అనేక జిల్లాలు తిరిగి ప్రజలతో మమేకం అయ్యిన తరువాత తన అభిప్రాయాన్ని మార్చుకున్నట్లు చౌదరి తెలిపారు. రాయలసీమ ప్రాంతంలో పర్యటన కానీ ఉత్తరాంధ్ర పర్యటన ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటన ఇవన్ని కూడా తన జీవితంలో గొప్ప అనుభూతి ఆప్యాయత మరువలేని విధంగా ఒక పుస్తకం గుర్తుండి పోయే అధ్యాయం లాగా నిలిచి పోతుందని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే ప్రజలకు సంతృప్తి కర మైన సేవలు అందించినపప్పుడే ఉద్యోగంలో ఉన్న ఆనందం వేరే ఉంటుందని రాజేందర్ చౌదరి అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతకుముందు పిఐబీ డైరెక్టర్ రత్నాకర్ ,ఆడిషనల్ డైరెక్టర్ శివారెడ్డి, శర్మ , రమేష్ తదితరులు ఆయన సేవలను కొనియాడారు. అనంతరం ఆయన్ని పలువురు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఈరోజు పత్రికా సంపాదకులు జెవి సుబ్రహ్మణ్యం,వార్తప్రభ సంపాదకులు వీర్ల శ్రీరామ్ యాదవ్,అంతిమ తీర్పు సంపాదకులు వల్లూరి ప్రసాద్ కుమార్, ప్రజాభూమి సంపాదకులు రామమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.