ఆంధ్ర లో కూడా సినిమాల కార్యక్రమాలకు సంబంధించిన ప్రక్రియ నెమ్మదిగా మొదలు కానుంది. ఒకప్పుడు అధికశాతం సినిమా షూటింగ్స్ హైదరాబాద్ లోనే జరిగేవి. ఈమధ్య కాలం లో ఆంధ్ర లో కూడా షూటింగ్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు సినిమా టైటిల్ రిజిస్ట్రేషన్స్ కూడా ఆంధ్ర లో చేసుకోవచ్చని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంస్థ వ్యవస్థాపకుడు, సినీ దర్శకుడు దిలీప్ రాజా ప్రెస్ మీట్ లో తెలిపాడు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘సినిమా టైటిల్ రిజిస్ట్రేషన్స్ ఆంధ్ర లో కూడా చేసుకోవచ్చు. కానీ ఏ ఫిల్మ్ ఛాంబర్ లో అయినా సినిమా టైటిల్ ఒక్కసారి రిజిస్టర్ అయితే అది వేరొకరికి ఇచ్చేందుకు వీలు ఉండదు. టైటిల్ రిజిస్ట్రేషన్స్ కు తమకు సెన్సార్ కార్యాలయం నుండి అనుమతి ఉంది’ అని ఈ సందర్భంగా ఆయన తెలిపాడు.