గండేపల్లి.
రాబోవు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగరాదని జగ్గంపేట సిఐ ఎస్ లక్ష్మణరావు,గండేపల్లి ఎస్సై రామకృష్ణ అన్నారు. దానిలో భాగంగా శుక్రవారం గండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో తాళ్లూరు,మల్లేపల్లి గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలు ను పరిశీలించి సంబంధిత గ్రామ పెద్దలకు, సంబంధిత పార్టీ కార్యకర్తలకు రాబోవు ఎలక్షన్స్ సంబంధించి తగు సూచనలు సలహాలు ఇచ్చి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని,ఎలక్షన్ అంతా ప్రశాంత వాతావరణంలో జరగాలని అవగాహన సదస్సు కల్పించారు. అదేవిధంగా ఎన్నికల సమయంలో ఎటువంటి గొడవల్లో కేసులకు వెళ్లిన వారు అనేక ఇబ్బందులు పడే పరిస్థితులు నెలకొంటాయని అందువల్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఆయా గ్రామస్తులు పాల్గొన్నారు.