జగ్గంపేట
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన, విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు శత వర్ధంతి సందర్భంగా కిర్లంపూడి మండలం, బూరుగుపూడి గ్రామం స్థానిక హైవే పక్కన ఉన్న అల్లూరి విగ్రహానికి ఏపీ ఆర్ సి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ భారత స్వాతంత్ర ఉద్యమంలో ఆయన తెగింపు, కృషి ,త్యాగం ఎనలేనిదని , బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, ఈ దేశ ప్రజల స్వేచ్ఛ ,స్వతంత్రాల కోసం, ధన,మాన ,ప్రాణాలను కాపాడడం కోసం అతి చిన్న వయసులోనే, బ్రిటిష్ తుపాకీ గుళ్లకు గుండె నేదురోడ్డి ప్రాణాలర్పించిన మహనీయుడని కొనియాడారు. నేడు పాలకులు అల్లూరి ఆశయాలకు తూట్లు పొడుస్తూ, సామ్రాజ్యవాదుల కబంధహస్తాల్లోకి ఈ దేశాన్ని బందీ చేస్తున్నారని విమర్శించారు. మతాన్ని కవచంగా అడ్డుపెట్టుకుని, దేశంలోని జాతి సంపదను ఆదాని, అంబానీ వంటి స్వదేశీ, విదేశీ కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. ప్రజా, కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాల అవలంబిస్తూ ప్రజలపై అధిక ధరలు, పన్నులు, భారాలను మోపుతున్నారన్నారు. నిరుద్యోగశాతం పెరిగిపోయిందన్నారు. ప్రజలు పోరాడి సాధించుకున్న అనేక హక్కులను కాలరాస్తూ ప్రజలని నయా బానిసలుగా చేస్తున్నారన్నారు. దళిత, ఆదివాసి, మహిళలు మైనార్టీలపై హత్యలు, హత్యాచారాలు పెరిగిపోయాయి అన్నారు.యువత అల్లూరి పోరాట స్ఫూర్తితో కులాలకు, మతాలకూ అతీతంగా ఐక్యమై మరో స్వతంత్ర పోరాటానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు కూలి సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కడితి సతీష్,నాయకులు సురేష్, డాన్ శీను, కర్రి కిట్టయ్య, బుర్ర రాఘవ, దాస పెద్ద అబ్బులు, వీరబాబు, పాఠం శెట్టి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

