గొల్లప్రోలు
స్వాత్రంత్ర్య సాధన కోసం అల్లూ రి చూపిన పోరాట పటిమను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని సాయి ప్రియ సేవా సమితి అధ్యక్షుడు, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి జ్యోతుల శ్రీనివాస్ తెలిపారు. మన్యం వీరుడు అల్లూరి సీతా రామరాజు వర్ధంతి సందర్భంగా గొల్లప్రోలు మండలం
కొడవలి-వన్నెపూడి జంక్షన్ జాతీయరహదారిపై గల అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద అల్లూరి సీతారామ రాజు యూత్ ఆధ్వర్యంలో అల్లూరి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జ్యోతుల ముఖ్య అతిధిగా తిధిగా విచ్చేసి ముందుగా సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ మన్యపువీరుడు,విప్లవజ్యోతి సర్గీయ అల్లూరి సీతారామరాజు భారత స్వాతంత్ర్యచరిత్రలో ఒక మహోజ్వల శక్తి అని,అల్లూరి సీతారామరాజు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయమని పేర్కొన్నారు., అల్లూరి సీతారామరాజు జయంతి,వర్ధంతి లాంటి కార్యక్రమాలను నిర్వహించడం వల్ల నేటి యువకుల్లో మంచి ఆదర్శభావాలు కలుగుతాయని జ్యోతుల తెలిపారు .ఈ కార్యక్రమంలో నక్కా బద్రి,నక్కా నారాయణమూర్తి,మద్దాల రామకృష్ణ,జోడ శ్రీను,మల్లిపాం కోటేశ్వరరావు,తోట సునీల్,ఎరికిరెడ్డి ప్రసాద్ రెడ్నం సూరిబాబు,మద్దాల శ్రీనివాసు, కొడవలి గ్రామం అల్లూరి సీతారామరాజు యూత్ సభ్యులు మచ్చా బాబురావు, అమజాల రమేష్,కుక్కా శ్రీను, తాటిపర్తి శివ,కుక్కా పండు,కొయ్యా పాపారావు, కాలిబోయిన గణేష్,పట్టపగలు శివ,కొంజర్ల దోరబాబు,ముప్పనబోయిన సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

