హిందూపురం టౌన్
హిందూపురం పట్టణంలో అర్హత కలిగిన వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఇంటి పట్టాను మంజూరు చేయడంతో పాటు ఇంటి నిర్మాణాన్ని చేసి ఇవ్వాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి జిల్లా కార్యదర్శి ఎం వి రమణ డిమాండ్ చేశారు సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో అనేక మంది నిరుపేదలు అద్దెలలో నివాసం ఉంటూ కూలీ పనులు చేస్తూ అద్దెలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు జారీ చేయడంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రిజిస్ట్రేషన్ ల పేరిట జాప్యం చేయడం తగదన్నారు వెంటనే అర్హత కలిగిన వారందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయడంతో పాటు ఇంటి పట్టాను అందించి ఇంటి నిర్మాణాన్ని చేపట్టాలని అప్పటిదాకా తమ పోరాటాలను ఉదృతం చేస్తామన్నారు ఇందులో భాగంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు అధ్యక్షురాలుగా నసీం తాజ్ కార్యదర్శిగా విమల కుమారి ఉపాధ్యక్షు రాలిగా శోభ సహాయ కార్యదర్శిగా పార్వతిని ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు జ్యోతమ్మ పట్టణ అధ్యక్షులు వెంకటేష్ కిష్టప్ప, నసీమాబాయి పరిమళ సత్యమ్మ సరస్వతి నీలా జయంతి రాము తదితరులు పాల్గొన్నారు