*ముడుపులన్నవి లేదంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారు…
*పిర్యాదు చేసినా పట్టించు కునే నాధుడు ఉండడా..
*పిర్యాదు ఐడి ఇచ్చింది ఎందుకొసమో…
*ఐడి చూసుకుని అన్ని సరేలే అనుకోవాలా ..
*టిపిఓ అంటే జరిగే తప్పులపై చర్యలు తీసుకోరా…
*ఎన్ని తప్పులంటే అన్ని తాయిలాలు వస్తాయని…?
*కార్పొరేషన్ ఉండేడేందుకు…ఈ కట్టడాలకు కాగితాలిచ్చేందుకు…
*అక్రమాలకు అడ్డుకట్ట వేయలేని అధికారులు ఉన్నా ఒకటేనా…
*వారి అక్రమాలు తీస్తే వీరి అక్రమాలు బైటికీ వస్తాయని భయమా…?
*సిటీ ప్లానర్ కు ఈ చిత్ర విచిత్రాలు పట్టవా…
*కమిషనర్ గారు మీ కార్పొరేషన్ ను కాపడలేరా…
*మీకు కూడా అవినీతి కంపు అంట కడుతున్నారే…
*కార్పొరేటరుంటే అక్రమ కట్టడాలకు అండగా ఉంటారనే అనుకోవాలా…?
*సుజనా గారు ఏమిటండి ఈ చిత్ర,విచిత్రాలు…
*కూటమి ప్రభుత్వం ఉన్నా కార్పొరేటర్ హవ్వా నేనా
*మీకు కూడా కట్టడిచేయక పోతే కార్పొరేషన్ నష్టం రాదా…
*43 వ డివిజన్ అక్రమ కట్టడాలను అడ్డుకునే వారెవరూ లేరా..
(రామమోహన్ రెడ్డి)
అక్రమం… అక్రమం…అంతా సక్రమమే ఇది బెజవాడ కార్పొరేషన్ పరిధిలోని భవానిపురం 43 వ డివిజన్ లో జరుగుతున్న తీరు.ఏ నిర్మాణం చేపట్టిన కార్పొరేషన్ అనుమతులు అంతంత మాత్రమే.కట్టడాలకు అనుమతులు ఇవ్వాల్సిందే అయితే ఆ కట్టడం సక్రమమా అక్రమమా అన్నది సంబంధిత అధికారులు పూర్తిగా పర్యవేక్షించి నిర్దారణ చేయాలి.అందుకే ప్లానింగ్ సెక్రటరీ,బిల్డింగ్ ఇన్స్పెక్టర్, టౌన్ ప్లానింగ్ ,అసిస్టెంట్,డిప్యూటీ,చీఫ్ సిటీ ప్లానర్ ఇలా ఒక వ్యవస్థ ఉంది.వీరందరికి ప్రజల కష్టం తో చెల్లిస్తున్న పన్నుల రూపంనుండి జీతాలు చెల్లిస్తూ అదే ప్రజలకు ఉపయోగపడే పనులు చేసేందుకు ప్రభుత్వం ఒక బాధ్యత అప్పహించింది.కానీ ఇక్కడ అదేమీ లేదన్నట్లుగా అదే ప్రజల నుండి లంచాల కోసం లాలూచీ పనులు చేస్తూ తమ కర్తవ్యాన్ని విస్మరిస్తున్నారు.ప్రజలకు జవాబు దారితనం కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన కార్పొరేటర్ లు ఎక్కడ ఏ కట్టడం జరిగింది. ఎన్ని కట్టలు తమ జేబుల్లోకి వచ్చాయని చూసుకోవడం తప్ప ఎదయితే హోదా ఉందొ ఆ హోదా కు తగ్గట్లుగా హుందాగా ఉందామనే ఆలోచన అసలు ఉండదు ఈ కార్పొరేటర్ లకి.ముఖ్యంగా 43 డివిజన్ ఎప్పుడు కూడా అవినీతి ఆరోపణలకు నిలయంగా మరిందనేది జగమెరిగిన సత్యం.43 డివిజన్ పోలేరమ్మ గుడి దగ్గర ఇంటి నెంబర్ 76-17-8ఇంటి ప్రక్కన ఓ నిర్మాణం తీరు అందరిని ఆచ్చర్యపరుస్తుంది.ప్లాన్ ఒకటి నిర్మాణం తీరు ఒకటి.ఇదెలా అంటే అంతా బిల్డింగ్ ఇన్స్పెక్టర్, ప్లానింగ్ సెక్రటరీ ఆశీస్సులు అంటూ నిర్మాణ దారుడు గగ్గోలు. ఇదేమిటయ్యా అని అధికారులను అడిగితే సమాధానం దాటవేత ధోరణి.
ఈ నిర్మాణం అక్రమమా సక్రమమా అని పిర్యాదు చేస్తే ఆ పిర్యాదు బుట్టదాఖలు.ఇలాంటి పరిస్థితుల్లో కార్పొరేషన్ కి ఆదాయం వచ్చేది ఎలా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది.
ఇన్ని జరుగుతుంటే ఏసీపీ, డీసీపీ లు చీఫ్ సిటీ ప్లానర్ లు ఏమి చేస్తున్నారని అనుకుంటే అందుకుసమాధానం దొరకని పరిస్థితి. ఇక కమిషనర్ వరకు ఈ అక్రమ కట్టడాల విషయాలు వెళ్లాయా అంటే ఆయన్ని కూడా బధనాం చేయడానికి కూడా వెనుకాడని పరిస్థితి ఏర్పడింది. పోనీలే స్థానిక ఎమ్మెల్యే అయిన కార్పొరేషన్ కు గండి పడకుం డా చూస్తారని అనుకుంటే ఆయన్ని కూడా మభ్యపెట్టే ధోరణి లో వాటాలు కూడా ఉన్నాయంటూ వీరి అవినీతిని అంట కట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ కింది స్థాయి అధికారులు. ఇవన్నీ పోతే కూటమి ప్రభుత్వం ఉన్నా కార్పొరేటర్ హవ్వా కొనసాగడం కొసమెరుపు.ఇన్ని రకాలుగా పాలన ఉన్న నేపధ్యంలో ఈ అక్రమ కట్టడాలతో అప్పనంగా వచ్చే సొమ్మును ఎవరైనా సొమ్ము చేసుకోవడం సాధారణమే. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కార్పొరేషన్ ని బాగు చేసే వారు ఇక లేరన్న మీమాంసకు అక్కడి ప్రజలు వచ్చేసారన్నది సమాచారం.