ఏలేశ్వరం:-
అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా మండలంలోని పలు గ్రామాలలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.
లింగంపర్తి, బద్రవరం, పేరవరం, పెద్దనాపల్లి, యర్రవరం తదితర గ్రామంలతొ పాటు ఏలేశ్వరం పట్టణంలో ఉన్న వివిధ దేవాలయాల్లో ఉదయం నుండి ముఖ్యంగా రామ మందిరాల్లో భజనలు సంకీర్తనలను ఆలపించారు.రామ కొలువుల్లో గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేపట్టారు.
రామ కొలువులతోపాటూ అన్ని దేవాలయాలలో భజనలు,పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు.
గ్రామపుర వీధుల్లో కోలాటం,భజనలు నృత్యాలతో శ్రీరాముని విగ్రహాలకు ఊరోగింపుజరిపించారు.
ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ ఈరోజు దేశ చరిత్రలో మరపురానిదని ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపు చూసే రోజని కొనియాడారు.రామ మందిరనిర్మాణం ఎన్నో ఏళ్ల కలఅని, నేడు అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ట జరగడం భారతదేశానికే గర్వకారణం అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో భక్తులుఅధికసంఖ్యలో పాల్గొన్నారు.