అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఇల్లినాయ్ రాష్ట్రంలోని షికాగోలో రెండు ఇళ్లపై కాల్పులు జరపగా ఏడుగురి ప్రాణాలు పోయాయి. కాల్పుల అనంతరం అక్కడి నుంచి దుండగుడు పరారయ్యాడు. దుండగుడి కోసం వేట కొనసాగిస్తున్నామని .. నగరంలో జోలియట్‌లోని వెస్ట్ ఎకర్స్ రోడ్‌లో ఉన్న 2200 బ్లాక్‌లో ఈ కాల్పుల ఘటన జరిగిందని, నిందితుడిని రోమియో నాన్స్ గా గుర్తించామని, ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడని పోలీసు అధికారులు వెల్లడించారు.