Tuesday, November 18, 2025

Creating liberating content

తాజా వార్తలుఅభివృద్ధి సంక్షేమమే‌ తెలుగుదేశం జనసేన అజెండా:యనమల దివ్య

అభివృద్ధి సంక్షేమమే‌ తెలుగుదేశం జనసేన అజెండా:యనమల దివ్య

తుని.‌. ‌‌. ‌‌. అభివృద్ధి సంక్షేమ పథకాలు కోసం తెలుగుదేశం జనసేన కూటమిని గెలిపించాలని తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ యనమల దివ్య ప్రజలకు పిలుపునిచ్చారు. జగన్ రెడ్డికి ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అధోగతి పాల్జేశారని వైకాపా విధ్వంసకర పాలన వల్ల రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రాజ్యమేలుతుందని ఆమె ఆందోళన వెలిబుచ్చారు. ప్రజలందరూ మార్పు కోరుతున్నారని వచ్చే ఎన్నికల్లో టిడిపి జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయమని యనమల దివ్య …తుని పట్టణ పర్యటనలో పేర్కొన్నారు. మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమంలో భాగంగా 10వ, వార్డులో భవిష్యత్తు గ్యారెంటీ ఉత్సాహభరితంగా సాగింది. ఇక్కడికి విచ్చేసిన జననేత్రి యనమల దివ్య కు మహిళలు మంగళహారతులతో బ్రహ్మరథం పట్టారు. అనంతరం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి యనమల కృష్ణుడుతో కలిసి దివ్య ఇంటింటి ప్రచారం చేశారు. టిడిపి జనసేన కార్యకర్తలతో ఇంటింటికి వెళ్లిన తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ యనమల దివ్య వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా యనమల కృష్ణుడు మాట్లాడుతూ వైకాపా ప్రజాకంటక ప్రభుత్వాన్ని తరిమికొట్టేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారన్నారు. ఇనుగంటి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ‌ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మోతుకూరు వెంకటేష్ ఎస్ ఎల్ రాజు యనమల శివరామకృష్ణ జనసేన సమన్వయకర్త చోడిశెట్టి శెట్టి గణేష్, టిడిపి నాయకులు మల్ల గణేష్ ,కుక్కుడపు బాలాజీ ,దిబ్బ శ్రీను,పోతల రాంబాబు,అల్లు రాజు,మామిడిదాసు సిద్ధాంతపు సత్తిబాబు ,జక్కాన రాము నాయుడు, చొప్పా సత్యనారాయణ, రామచంద్ర రాజు, శిల్పరశెట్టి జగన్మోహన్, కుండల పెదబాబు, అడిగర్ల అప్పలనాయుడు, తాడి లక్ష్మణరావు,పూడి సత్యవేణి, కాళ్ల అమ్మాజీటిడిపి జనసేన నాయకులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article