అవకాశం ఇస్తే అన్నివేళలా అండగా ఉంటారు…!!
టీడీపీ యువనేత పులివర్తి వినీల్
రామచంద్రపురం
చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఇంటింటా, గ్రామగ్రామాన సమస్యలు తిష్ట వేశాయని చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ ఇన్చార్జి, చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని తనయుడు పులివర్తి వినీల్ అన్నారు. మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని, బాబు ఘారిటి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన రామచంద్రాపురం మండలం, నెన్నూరు పంచాయితీలో పర్యటించారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన మండల నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పులివర్తి వినీల్ ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. మినీ మేనిఫెస్టో లోని అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ వైసీపీ అరాచక పాలనలో ఇంటి ఇంటిలో సమస్యలు తిష్ట వేశాయని పులివర్తి వినీల్ అన్నారు. ఎక్కడా పర్యటిస్తున్న సమస్యలు వెల్లువెత్తుతున్నాయని పేర్కొన్నారు. నాలుగున్నర ఏళ్లలో ఎమ్మెల్యే ఏం చేశారని ప్రశ్నించారు. చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే నా తండ్రి పులివర్తి నానికి ఒక్క అవకాశం ఇవ్వలాని కోరారు. 24 గంటలు అందుబాటులో ఉండి పేదల కష్టాలను తీరుస్తారని వినీల్ భరోసా ఇచ్చారు. మీ సమస్యల పరిష్కారం కోసం పులివర్తి నాని కృషి చేస్తారన్నారు. నిరంతరం ప్రజల మధ్యలో ఉంటారన్నారు. టీడీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అట్టడుగు ప్రజలకు అండగా నిలిచిందని గుర్తు చేశారు. కొత్త రేషన్ కార్డు, కొత్త పెన్షన్ లేక ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రభుత్వాన్ని ఈ సారి ఇంటికి పంపించడానికి "సిద్ధం"గా ఉండాలని ఆయన తెలిపారు.
ఈ వైసిపి పాలనలో విసిగి పోయామని ప్రజలు తమ సమస్యలను తన దృష్టికి తీసుకువస్తున్నారని పులివర్తి వినీల్ అన్నారు. అన్ని అర్హతలు ఉన్న ఫించన్లు తొలగించారని, ప్రతిచోటా వైసీపీ సానుభూతి పరులకే ఇంటి పట్టాలు మంజూరు చేశారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని సమస్యలకు పరిష్కారం ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని, రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి పులివర్తి నానికి ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తిరుమలరెడ్డి, జనార్దన్ చౌదరి, సాయి ప్రతాపరెడ్డి, నడవలూరు గ్రామస్తులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు