ప్రజాభూమి, వి.ఆర్.పురం
ఆంద్రప్రదేశ్లో అభివృద్ధి అనేది వైసీపీ తోనే సాధ్యమవుతుందని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నిరూపించారని వై ఎస్ ఆర్ సీ పీ మండల అధ్యక్షులు మాదిరెడ్డి సత్తిబాబు, జే సి ఎస్ మండల ఇంఛార్జ్ బొడ్డు సత్యనారాయణ అన్నారు. వడ్డిగూడెం సచివాలయంలో మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమంని గ్రామ పంచాయతీ సర్పంచ్ సోడి నర్సమ్మ, వైస్ ఎం పి పి ముత్యాల భవాని ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా వై ఎస్ ఆర్ సీ పీ మండల అధ్యక్షులు మాదిరెడ్డి సత్తిబాబు, జే సి ఎస్ మండల ఇంఛార్జ్ బొడ్డు సత్యనారాయణ మాట్లాడుతూ మహాత్మా గాంధీ గారు కలలు గన్న గ్రామ స్వరాజ్యం ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి తోనే సాధ్యం అవుతుందని, రాష్ట్రం లో ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని వారన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు మాదిరెడ్డి సత్తిబాబు జండాను ఆవిష్కరించి, తదనంతరం విఆర్ పురం గ్రామంలో ఇల్లిళ్లు తిరిగి చంద్రబాబు అవినీతి గురించి, వైసీపీ పరిపాలన గురించి వివరించారు. రానున్న రోజులల్లొ వై ఎస్ ఆర్ సీ పీ కి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మార్కెటింగ్ కమిట్ మెంబర్ మాచర్ల గంగయ్య, ఎస్సీ ఎస్టి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిషన్ సభ్యులు చిక్కాల బాలు, సొసైటీ చైర్మన్ ముత్యాల మురళి, ముత్యాల గౌతమ్, పంచాయతీ కార్యదర్శి స్వరూప్ రెడ్డి ఈ ఒ ఆర్ డీ వెంకట్, రేఖపల్లి ఎం పి టి సి బంధం విజయలక్ష్మి, చినమట్టపల్లి సర్పంచ్ పిట్టా రామారావు, మామిడి రాజు, చీమలు కాంతారావు, ఉప సర్పంచ్ కోట్ల శ్రీను, సచివాలయ కన్వీనర్ లు, గృహసారదులు, వార్డు సభ్యులు రాజుపేట వి.ఆర్. పురం కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.