రామచంద్రాపురం :రాష్ట్రంలోనే ఎక్కడా లేనివిధంగా రామచంద్రపురం అభివృద్ధి పథంలో నిలిచిందని రాయలచెరువు సర్పంచ్ మాదాసు మురగయ్య అన్నారు. రామచంద్రపురం మండలంలోని మిట్ట కండ్రిగ, కుప్పం బాదురు, సికేపల్లి, నెత్త కుప్పం ,సి. రామాపురం సచివాలయ పరిధిలో జరిగిన అభివృద్ధి పనులను బుధవారం ఎంపీపీ బ్రహ్మానంద రెడ్డి జెడ్పిటిసి ఢిల్లీ భాను కుమార్ రెడ్డి, లతో కలిసి చెవిరెడ్డి ద్యానేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచి మురగయ్య, జడ్పిటిసి ఢిల్లీ ర్యాలీ మాట్లాడుతూ ఐదు సచివాలయ పరిధిలో 89 పనులు గాను 10 కోట్ల 50 లక్షలు రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు. సమావేశ మందిరాలు, గ్రంథాలయాలు, స్మశాన వాటికల అభివృద్ధి, రచ్చబండలు, సిమెంట్ బల్లలు, యోగ ధ్యాన మందిరాలు, ఆర్ఓ ప్లాంట్లు వంటి అనేక రకాల పనులను గ్రామాల చేపట్టి అభివృద్ధి చేశామన్నారు. ప్రజలందరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సంక్షేమం అభివృద్ధి కొనసాగాలంటే చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రత్యూష, ఎంపీటీసీ కృష్ణవేణి, ఏం మంజుల సిద్ధారెడ్డి, డివిజన్ అధ్యక్షుడు చిట్టిబాబు నాయుడు, భాస్కర్ రెడ్డి, నాయకులు యశ్వంత్ రెడ్డి, భాస్కర్ రాయల్ , భాస్కర్ రెడ్డి, బికిరెడ్డి, మారయ్య, మనోహర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
