Thursday, September 11, 2025

Creating liberating content

తాజా వార్తలుఅభివృద్ధిపై మేము చర్చకు సిద్దం…మీరు సిద్ధమా…

అభివృద్ధిపై మేము చర్చకు సిద్దం…మీరు సిద్ధమా…

-టిడిపి పాలనలో అభివృద్ధి ఏమి చేశారు…
ఓటమి భయంతో ప్రలోభాలకు తెరలేపారు
వైసిపి నాయకులు

హిందూపురం టౌన్
గత 10 సంవత్సరాల బాలయ్య పాలనతో పాటు గత టిడిపి ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంత ప్రజలకు చేసింది ఏమి లేదని… అభివృద్ధి విషయంలో తాము బాలయ్యతో చర్చకు సిద్ధంగా ఉన్నామని…. మేము శ్వేత పత్రం తీసుకుని వస్తాము… మీరు శ్వేత పత్రం తీసకుని చర్చలకు రావాలని ఎమ్మేల్యే బాలకృష్ణకు వైసిపి నాయకులు సవాల్ విసిరారు. బాలయ్య చేసిన వ్యాఖ్యలపై వైసిపి నాయకులు మండిపడ్డారు. శుక్రవారం స్థానిక వైసిపి పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ ఇంద్రజ, వై స్ చైర్మెన్లు జబివుల్లా, బలరామిరెడ్డి, చైసిపి నాయకులు వేణురెడ్డి, కొండూరు వేణుగోపాల్ రెడ్డి, మధుమతి రెడ్డిలు మాట్లాడారు. నాటి ఎన్టీఆర్ నుంచి నేటి బాలయ్య వరకు నియోజక వర్గాన్ని ఏ మాత్రం అభివృద్ది ఏమాత్రం చేయలేదన్నారు. ఇచ్చిన మాట ప్రకారం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పేదల సొంతింటి కల నెరవేర్చారని , ఆటోనగర్, ఇందిరమ్మ కాలనీలను ఏర్పాటు చేస్తే అధికారంలోకి వచ్చిన టిడిపి ఆయా ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాలను కల్పించలేదన్నారు. మీ నాయకుల కోసం మేళాపురం ప్రాంతలో మురుగు కాలువ గమనాన్నే మార్చినారన్నారు. అధికారంలో ఉన్న హయాంలో సొంత ప్రయోజనాల కోసం రాకలాడారని ఆరోపించారు. ఈ 5 సంవత్సరాల కాలంలో 24 సార్లు పర్యటించారు. గత ఐదేళ్లలో బాలకృష్ణ పర్యటన పెళ్లిళ్లకు, ఇతర సొంత కార్యక్రమాలకు మాత్రమే వచ్చారు తప్ప, ఏ రోజూ ఎమ్మేల్యే హోదాలో అభివృద్ధిపై అధికారులతో చర్చలు జరపలేదు…. ఏ నాడు నియోజక వర్గ సమస్యలపై శాసన సభలో మాట్లాడలేదన్నారు. ప్రజలు చెల్లించే పన్నులతో తీసుకుంటున్న వేతనంలో కాస్తా పనులు చేపట్టి సొంత నిధులతో అని చెప్పడం చూస్తుంటే హాస్యస్పదంగా ఉందన్నారు. కరోనా విసత్కర సమయంలో, వరదలు వచ్చిన సమయంలో ప్రజలు కనిపించ లేదా అని ప్రశ్నించారు. సిని గ్లామర్ తో కొందరు వచ్చి సెల్ఫీలు దిగితే అందరురూ తమకు మద్దతు ఇస్తారు అనే భ్రమలో నుంచి బయటకు రావాలన్నారు. ఎన్నికలు వస్తున్నాయని తమ స్వార్ధ ప్రయోజనాల కోసం పర్యటన, సమీక్షాల పేరుతో నల్ల డబ్బును తీసుకొచ్చి భద్ర పరుస్తున్నారు , సినిమా డైలాగులు చెప్పి ఫోజులిస్తే ఇక్కడ ప్రజలు అమాయకుల కాదన్నారు. 30 మంది వైసిపి కౌన్సిలర్లు ఉంటే ఒక్క కౌన్సిలర్ ను టిడిపిలోకి చేర్చుకోవడానికి ఏకంగా ఎమ్మెల్యే బాలకృష్ణ రంగంలోకి దిగాడు. అష్ట కష్టాలు పడి ఇంట్లో ఉన్న కౌన్సిలర్ పరశురాం ను బ్రతిమలాడి ఎమ్మెల్యే బాలకృష్ణ క్యాంపు కార్యాలయం తీసుకెళ్లి కండువా వేశారన్నారు. ఒక కౌన్సిలర్ మీ పార్టీలో వచ్చిన మాత్రన అందరరూ వచ్చినట్లు కాదన్నారు. వైసిపి వారిని ప్రలోభాలకు గురి చేస్తున్నారు. మేము మీ పార్టీ వారిని ప్రలోభాలు గురి చేయడం మొదలుపెడితే హిందూపురంలో మీ పార్టీకి మనుగడ సైతం ఉందడన్నారు. ఒక్క 20వ వార్డులోనే రూ.16.39 కోట్లు ప్రజా సంక్షేమం కోసం విడుదల చేయడం జరిగిందన్నారు. దీంతో పాటు వాటర్ పైప్ లైన్ ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఇది తెలియక తన వార్డ్ అభివృద్ధి కాలేదని పర శురాం టిడిపిలో చేరడం పద్ధతి కాదన్నారు. ఎన్నికల సమీపంలో ఉండడంతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పూర్తి స్థాయిలో దృష్టి సారించి పర్యటన చేస్తుండడంతో మంత్రికి భయపడి మంత్రి ఎప్పుడు పర్య టించిన అప్పుడు బాలకృష్ణ పర్యటన చేస్తున్నారు, ఈ సారి అసలు బాలకృష్ణ పోటీలో ఉంటారా లేదా అన్నది సైతం గ్యారంటీ లేదన్నారు. ఇక బాబు ష్యూరిటీ అంటూ ముందుకు వస్తున్నారు, ష్యూరిటీ ఇచ్చిన బాబుకు ఆరు మంది ష్యూరిటీ ఇస్తేగాని జైలు నుంచి బయటకు రాలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్వర్థి కురుబ సామాజిక వర్గానికి చెందిన దీపిక, ఎంపి అభ్వర్థి బోయ సామాజిక వర్గానికి చెందిన శాం తమ్మలను అందరం ఐక్యంగా గెలిపించుకుని ముఖ్యమంత్రి జగన్ మెహన్ రెడ్డి కానుకగా ఇస్తాం అన్నారు. అభివృద్ధి విషయంలో తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని… నిజంగా బాలకృష్ణ అభివృద్ధి చేసింటే చర్చ కు సిద్ధం కావాలని సవాల్ చేశారు. ఈ సమావేశంలో కౌన్సిలరు. వెసిపి నాయకులు హనుమంత రెడ్డి బసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article