Saturday, February 28, 2026

Creating liberating content

తాజా వార్తలుఅపర్ణ అమ్మవారికి శ్రీ పంచమి పూజలు

అపర్ణ అమ్మవారికి శ్రీ పంచమి పూజలు

గొల్లప్రోలు

   గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలో వేంచేసియున్న శ్రీ అపర్ణ అమ్మవారికి బుధవారం మాఘమాసం శ్రీ పంచమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సరస్వతి అమ్మవారి జన్మదినం సందర్భంగా అపర్ణ అమ్మవారిని సరస్వతీ మాతగా అలంకరించారు. ఈ సందర్భంగా సుమారు 100 మంది చిన్నారులచే అక్షరాభ్యాసం  చేయించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఆకొండి ప్రభాకర శాస్త్రి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వేద పండితులు, దైవజ్ఞరత్న ఆకొండి వెంకటేశ్వర శర్మ, ఆలయ కమిటీ చైర్మన్ గారపాటి బుజ్జి, గ్రామ ఉపసర్పంచ్ దాసం వెంకటేష్ పలువురు ఆలయ కమిటీ సభ్యులు, వివిధ గ్రామాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article