Sunday, September 14, 2025

Creating liberating content

తాజా వార్తలుఅన్న క్యాంటీన్ లో పేదలకు అన్నదానం నిర్వహించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

అన్న క్యాంటీన్ లో పేదలకు అన్నదానం నిర్వహించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

జగ్గంపేట :స్థానిక కాకినాడ రోడ్డులో గల ఎన్టీఆర్ కాంస్య విగ్రహం వద్ద ప్రతి సోమవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ ఈ వారం గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట గ్రామానికి చెందిన కీర్తిశేషులు స్వర్గీయ ఏపీఈపిడీసీఎల్ ఉద్యోగి నేదూరి రామకృష్ణ జ్ఞాపకార్థం నీలాద్రిరావుపేట, జగ్గంపేట,ఉద్యోగ మిత్ర బృందం అన్నా క్యాంటీన్ కి సహాయం అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హాజరై పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ గత సంవత్సరం ఆరు నెలలు కాలంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నామని దీనికి దాతలు ముందుకొచ్చి సహాయం అందిస్తున్నారని తెలియజేశారు. గత ప్రభుత్వం పేదల నోటి కాడ అన్నం లాగి అన్న క్యాంటీన్ రద్దు చేశారని మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని తొందరలోనే ప్రతి మండల కేంద్రం లోను అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి పేదలకు ఐదు రూపాయలకే అన్నం అందించడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ వి ఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, జీను మణిబాబు, కొత్త కొండబాబు, కోర్పు సాయి తేజ, జాస్తి వసంత్,మాజీ ఎంపిటిసి నేదూరి ఉపేంద్ర రావు, చిట్యాల అప్పారావు, నేదూరి త్రిమూర్తులు, నేదూరి మునసీబూ, గ్రామ పార్టీ అధ్యక్షుడు కురుకూరు చౌదరి, తంగేళ్ల అప్పారావు,నక్క కృష్ణ, వెంకటేశులు, అద్దంకి రాంబాబు, శివయ్య , సత్తిబాబు, ఐవి రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article