Friday, September 12, 2025

Creating liberating content

తాజా వార్తలుఅన్న ఎన్టీఆర్ స్ఫూర్తితోనే అన్నా క్యాంటీన్ :కందుల చిట్టిబాబు

అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితోనే అన్నా క్యాంటీన్ :కందుల చిట్టిబాబు

జగ్గంపేట

: స్థానిక ఎన్టీఆర్ కాంస్య విగ్రహం వద్ద రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం అన్న క్యాంటీన్ ఏర్పాటుచేసి దాత సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈవారం గండేపల్లి మండలం నీలాద్రి రావు పేట గ్రామానికి చెందిన కురుకూరి సీతారామకృష్ణ కుమారులు నీలాద్రి రావు పేట గ్రామ టిడిపి అధ్యక్షులు కురుకూరి వీర వెంకట చౌదరి, రమేష్ ల ఆర్థిక సాయంతో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి ఎస్వీఎస్ అప్పలరాజు, కందుల చిట్టిబాబు, జీను మణిబాబు ముఖ్య అతిథిలుగా హాజరై అన్నం వడ్డించారు. ఈ సందర్భంగా కందుల చిట్టిబాబు మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో చంద్రబాబు అన్న క్యాంటీన్ పెట్టి పేదలకు 5 రూపాయలకే అన్నదానం నిర్వహిస్తే వాటిని వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేయడం చాలా అన్యాయమని వారికి కళ్ళు తెరిపించేందుకు జ్యోతుల నెహ్రూ నేతృత్వంలో సంవత్సర కాలంగా జగ్గంపేటలో అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నారని దీనికి దాతలు కూడా ముందుకు వచ్చి సహకరిస్తున్నారని మళ్లీ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగ్గంపేట నియోజకవర్గం లో ప్రతిరోజు అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి పేదల ఆకలి తీరుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, కందుల చిట్టిబాబు, జీనుమణి బాబు, కొత్త కొండబాబు కందుల విజయ్, సుంకవిల్లి రాజు, కందుల వినయ్, కందుల జమ్మి, సుంకవిల్లి వీర వెంకట సత్యనారాయణ (యల్లమిల్లి సీఎం) పాలచర్ల సత్యనారాయణ, కంటిపూడి రామారావు, కందుల గంగాధర్, పరిమి సత్తిబాబు, సోని బోయిన అప్పారావు, సోడా సాని ధర్మరాజు, కట్టు అప్పారావు పి. సూర్యనారాయణ రాజు, కారుకొండ శ్రీను, అడప గోపాలరావు, గుమ్మడి గంగాధర్, పాతూరి సందీప్, వైభోగుల గంగారావు, కందుల భద్ర రావు, బోళ్ల గోపి, కందుల సత్యనారాయణ, కురుకూరి లచ్చబాబు, బొడ్డు రాంబాబు, గంధం సూరిబాబు, బిక్కిన ప్రసాద్, బొడ్డు వినయ్, బొడ్డు మంగరాజు, కందుల చిన్న, తిబిరి శెట్టి త్రిమూర్తులు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article