హైదరాబాద్:కేసీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారం పోయినా కేసీఆర్ కు అహంకారం తగ్గలేదని … నల్గొండలో భారీ బహిరంగసభ ద్వారా ప్రజల్లోకి కేసీఆర్ వెళ్తున్నారని… గత పదేళ్ల కాలంలో ఏనాడైనా ప్రజల్లోకి ఆయన వెళ్లారా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం… ఉంటే ఫామ్ హౌస్ లేదా ప్రగతి భవన్ లో ఉండేవారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి బయటపడుతుందనే… కృష్ణా జలాల గురించి మాట్లాడుతూ ప్రజల దృష్టిని దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని వీహెచ్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి, ఓర్చుకోలేకపోతున్నారని అన్నారు.